క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయిన తరువాత రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో రాజకీయ నాయకులను వేగంగా పరుగులు తీస్తున్నారు. ప్రతిరోజు విశ్రాంతి తీసుకునే సమయం కూడా రాజకీయ నాయకులకు ఇవ్వడం లేదు. తాజాగా ఇదే విషయాన్ని మంత్రి నారా లోకేష్ విశాఖలో జరిగినటువంటి ఒక ఈవెంట్ లో భాగంగా తన తండ్రి చంద్రబాబుపై ఒక ఆసక్తికరమైన విషయాన్ని పంచుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడు తో కలిసి పని చేయడం చాలా కష్టము అని లోకేష్ అన్నారు. ఏదైనా విజయాన్ని సాధించిన కూడా దానిని ఐదు నిమిషాల పాటు కూడా ఎంజాయ్ చేయనివ్వరు అని అన్నారు. సింగపూర్ వెళ్లి వచ్చినా.. తిరిగి ఢిల్లీ వచ్చి అస్సాం వెళ్లి తిరిగి మళ్ళీ విజయవాడ కి వచ్చాను. వచ్చిన వెంటనే ఐదు నిమిషాలు ఖాళీ లేకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరో 22 పాయింట్లు ఇచ్చి దీనిపై ఫోకస్ చేయని చెప్పారన్నారు. కనీసం ప్రయాణాన్ని కూడా ఎంజాయ్ చేయనివ్వరా అంటూ ముఖ్యమంత్రి ని నవ్వుతూ ప్రశ్నలు సంధించారు. అయితే ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు సరదాగా చెప్పలేదు. ఒక విజన్ తో ముందుకు వెళ్లాలంటే ప్రతి విజయాన్ని, ఓటమిని చూసుకుంటూ ముందుకు సాగాలి అని సూచించారన్నారు. ఒడిదుడుకులను ఎదుర్కోవాలి అంటే ఎక్కడా కూడా రిలాక్స్ అవ్వకూడదు అని.. సీఎం చంద్రబాబు నాయుడు ఇలా ప్రతి విషయంలోనూ ముందు ఆలోచనతో తరుముతుంటారు అని అన్నారు. ఇలాంటి నాయకుడే రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో ఎప్పటికైనా నడిపించగలరు అని.. ముఖ్యమంత్రి ఇలా ఉండడంతోనే ఈరోజు ఏపీ ఇంతటి వేగంతో అభివృద్ధి పదంలో ముందుకు వెళుతుంది అని తెలిపారు.
నష్టపోతున్న నిర్మాతలు… భారీగా తగ్గనున్న హీరోల రెమ్యూనరేషన్లు!
అమరావతి నిలిచిపోతుందా…? సోషల్ మీడియాలో దుమారం…