క్రైమ్ మిర్రర్, సినిమా:- ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో హీరోలకు రెమ్యూనరేషన్లు ఇష్టానుసారంగా పెరిగిపోయాయి. హీరో మార్కెట్కు మించి రెమ్యూనరేషన్లు తీసుకోవడంతో నిర్మాతలు కొన్ని సందర్భాల్లో భారీగా నష్టపోతున్నారు. హీరో హీరోయిన్లకు అలాగే దర్శకులకు పారితోషకాలు ఎక్కువ అవ్వడంతో పెద్ద ఎత్తున నిర్మాతలమైన మేము నష్టపోతున్నామంటూ చెప్పుకొస్తున్న సందర్భాలు నిత్యం చూస్తూనే ఉన్నాం. ఈ తరుణంలోనే తెలుగు హీరోల రెమ్యూనరేషన్ లో భారీగా కోతలు విధించాలి అని నిర్మాతలు భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ మధ్యకాలంలో థియేటర్లకు వచ్చే ఆడియన్స్ సంఖ్య తగ్గిపోవడం, హీరో మార్కెట్కు మించి ఖర్చు పెట్టడం, ఓటీటీల నుంచి కూడా ఆశించినంత స్థాయిలో ప్రాఫిట్ రాకపోవడంతో నిర్మాతలు భారీగా నష్టపోతున్నారు. దీంతో త్వరలోనే టాలీవుడ్ నటుల రెమ్యునరేషన్లు తగ్గించే ప్లాన్ లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక మరోవైపు సినిమా టికెట్ల ధరల వల్ల ప్రేక్షకులకు ఎలాంటి భయం లేదు అని.. థియేటర్లలో అమ్ముతున్నటువంటి వస్తువుల రేట్లపై ప్రేక్షకుల్లో ఒక ఇంత భయం నెలకొంది అని.. తద్వారా అనే థియేటర్లకు ప్రేక్షకులు రానీయడం మానేస్తున్నారు అని నిర్మాత నాగ వంశీ ఫైర్ అయిన విషయం తెలిసిందే.
అమరావతి నిలిచిపోతుందా…? సోషల్ మీడియాలో దుమారం…
ఒక్కో హీరో నుంచి ఒక్కోటి నేర్చుకున్నాను : హీరోయిన్ భాగ్యశ్రీ