Homeఆంధ్ర ప్రదేశ్ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరు విద్యార్థులు మృతి

ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా విద్యుదాఘాతం.. ఇద్దరు విద్యార్థులు మృతి


క్రైమ్ మిర్రర్ : తిరుపతి జిల్లా పుత్తూరులో విషాదకర ఘటన చోటుచేసుకుంది. స్థానికంగా జరుగుతున్న ద్రౌపతమ్మ–ధర్మరాజుల ఉత్సవాల సందర్భంగా ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. కె.ఎన్. రోడ్డులోని పూజా టెక్స్‌టైల్స్ సమీపంలో కొంతమంది విద్యార్థులు ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో ఫ్లెక్సీ అనుకోకుండా 11 కేవీ విద్యుత్ తీగలకు తగలడంతో ఒక్కసారిగా విద్యుత్ షాక్‌కు గురయ్యారు. తీవ్రంగా గాయపడిన ఇద్దరు విద్యార్థులు అక్కడికక్కడే మృతిచెందారు.

సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతులను విగ్నేష్ (19), గోకుల్ (18)గా గుర్తించారు. వీరిద్దరూ పుత్తూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యార్థుల మృతితో వారి కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. కుమారులను కోల్పోయిన తల్లిదండ్రుల రోదనలు స్థానికులను కలచివేశాయి.
also read : దారి తప్పుతున్న తెలంగాణ రాజకీయం…!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు