క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో సిపిఐ కాంగ్రెస్ కూటమి నుంచి తప్పుకోనుందా? తిరిగి కెసిఆర్ వైపు ఆ పార్టీ చూస్తోందా? హస్తం పార్టీతో కటీఫ్ చెప్పడం ఖాయమా? అనే బలమైన చర్చ నడుస్తోంది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, సిపిఐ కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు వ్యాఖ్యలు చూస్తుంటే ఈ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది.
మొన్నటి ఎన్నికల్లో పొత్తు…
Also Read:చీకట్లో బంగ్లాదేశ్.. చమురు కొరతతో అల్లాడుతున్న ప్రజలు, భారత్ సాయం కోరిన ప్రభుత్వం
2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకుంది సిపిఐ. ఆ ఎన్నికల్లో భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో గెలిచింది సిపిఐ. అయితే కొద్ది కాలం కిందట జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లోను కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ ను సిపిఐ గెలుచుకుంది. ఆ పార్టీకి చెందిన నేత మేయర్ గా ఎన్నికయ్యారు. అయితే అప్పట్లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పావులు కదిపారు. తమ పార్టీ నేతను మేయర్ గా ఎన్నుకునేందుకు చూశారు. కానీ అది వర్క్ అవుట్ కాలేదు.
అనవసర జోక్యం…
Also Read:బిల్ గేట్స్ కుమార్తెకు ఊహించని షాక్… ఫియా షాపింగ్ స్టార్టప్‌పై ‘కుకీ స్టఫింగ్’ ఆరోపణలు..
అయితే అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మిత్ర ధర్మం పాటించడం లేదని సిపిఐ ఆగ్రహంగా ఉంది. ముఖ్యంగా భద్రాద్రి కొత్తగూడెం నియోజకవర్గంలో పాటు చాలా ప్రాంతాల్లో సిపిఐ ను తక్కువగా అంచనా వేస్తోంది కాంగ్రెస్ పార్టీ. ప్రభుత్వంలో తగిన ప్రాధాన్యం దక్కడం లేదు. నామినేటెడ్ పోస్టుల్లో ఆ పార్టీకి ఛాన్స్ ఇవ్వలేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా సిపిఐ శ్రేణులకు ప్రాధాన్యం లభించలేదు. పైగా కొత్తగూడెం నియోజకవర్గంలో సిపిఐ ఎమ్మెల్యే ఉండగా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆధిపత్యం ప్రదర్శించేందుకు చూస్తున్నారు. అందుకే వచ్చే ఎన్నికల్లో సిపిఐ గులాబీ పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది.
బిజెపి అధికారంలోకి రాకుండా…
Also Read:లష్కరే ఉగ్రవాదులతో వేదిక పంచుకున్న పాక్ మాజీ మంత్రి.. భారత్‌పై సంచలన వ్యాఖ్యలు
వాస్తవానికి గత ఎన్నికల్లో కేసీఆర్ పిలిచి ఉంటే సిపిఐ పొత్తు పెట్టుకునేది. పైగా అప్పట్లో వామపక్షాల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు కేసీఆర్. మరోవైపు ఎలాగైనా అధికారంలోకి వచ్చేందుకు భారతీయ జనతా పార్టీ ప్రయత్నం చేసింది. అందుకే బిజెపికి అవకాశం ఇవ్వకూడదు అని వామపక్షాలు భావించాయి. అందులో భాగంగా సిపిఐ కాంగ్రెస్తో జత కలిసింది. కానీ ఆశించిన స్థాయిలో కాంగ్రెస్ సిపిఐ కు ప్రాధాన్యం ఇవ్వడం లేదు. అందుకే ఆ పార్టీతో కటీఫ్ చెప్పేందుకు సిపిఐ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రాదేశిక ఎన్నికల్లో కచ్చితంగా సిపిఐ ఏదో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది.
