Homeక్రైమ్మణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. అపార్ట్‌మెంట్‌లో చోరీ

మణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. అపార్ట్‌మెంట్‌లో చోరీ

హైదరాబాద్‌ మణికొండలో తెల్లవారుజామున చోరీ ఘటన కలకలం రేపింది. నెక్నాంపూర్‌లోని ఫ్లోటిల్లా అపార్ట్‌మెంట్స్‌లోకి చొరబడిన దుండగులు ఓ ఫ్లాట్‌ను టార్గెట్ చేసి నగదు, ఐదు వాచీలను ఎత్తుకెళ్లినట్లు సమాచారం. ఈ ఘటన వెనుక చెడ్డీ గ్యాంగ్‌ ప్రమేయం ఉండొచ్చనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

పోలీసుల వివరాల ప్రకారం.. అపార్ట్‌మెంట్‌ వెనుక భాగంలో ఉన్న కంచెను కత్తిరించి దుండగులు లోపలికి ప్రవేశించినట్లు తెలుస్తోంది. అనంతరం మెట్ల మార్గం ద్వారా సి-బ్లాక్‌లోకి చేరుకున్నారు. అక్కడ ఓ ఫ్లాట్‌లో చోరీకి పాల్పడి నగదుతో పాటు ఐదు వాచీలను అపహరించినట్లు సమాచారం.

దుండగుల కదలికలను అపార్ట్‌మెంట్‌లో నివసించే ఓ వ్యక్తి గమనించినట్లు తెలుస్తోంది. దీంతో ఘటనపై స్థానికుల్లో ఆందోళన నెలకొంది.

చోరీపై సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అపార్ట్‌మెంట్‌లోని సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. ఫుటేజీ ఆధారంగా దుండగులను గుర్తించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. అనుమానితుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

also read: ఢిల్లీ-ఎన్సీఆర్‌లో వరుస అత్యాచారాలపై సుప్రీంకోర్టు సుమోటో.. అధికారులపై కీలక వ్యాఖ్యలు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు