క్రైమ్ మిర్రర్,ఆంధ్రప్రదేశ్:- ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై సామాజిక మాధ్యమాల్లో అసభ్యకరమైన మరియు అనుచిత పోస్టులు పెట్టిన వ్యవహారంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్‌ను లక్ష్యంగా చేసుకుని వివాదాస్పద పోస్టులు పెట్టిన గుంటూరు జిల్లా వడ్డేశ్వరానికి చెందిన రవీంద్రబాబు అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
డిప్యూటీ సీఎం గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా రవీంద్రబాబు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని పిఠాపురం జనసేన నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా, పార్టీ కార్యకర్తలు మరియు మద్దతుదారుల మధ్య అనవసరమైన విభేదాలు సృష్టించి, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఉద్దేశంతోనే ఈ పోస్టులు పెట్టినట్లు వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. జనసేన నేతల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు, సాంకేతిక ఆధారాలతో విచారణ జరిపి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మరోవైపు, పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని (పర్సనల్ లైఫ్) లక్ష్యంగా చేసుకుని సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారాలు, అనుచిత పోస్టులు పెడుతున్న వారిపైనా రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. సామాజిక మాధ్యమాల వేదికగా వ్యక్తిత్వ హననానికి పాల్పడే వారిని ఉపేక్షించేది లేదని, చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసు అధికారులు హెచ్చరిస్తున్నారు. ఈ అరెస్టులతో సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టే వారిలో అలజడి మొదలైంది.
స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు షేక్ హసీనా సంచలన నిర్ణయం.. ప్రాణాలకు తెగించి బంగ్లాలో అడుగుపెడతారా?
