-
పెరిగిపోనున్న ప్రభుత్వ వ్యతిరేకత
-
సొంత పార్టీలో అసంతృప్త స్వరాలు
-
గెలిస్తే మాత్రం భారీ అడ్వాంటేజ్
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి అగ్నిపరీక్ష ఎదురుకానుంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల రూపంలో సరికొత్త సవాల్ ముందుంది. ఒకవేళ పట్టభద్రులు గెలిపిస్తే రేవంత్ కు రాజకీయంగా తిరుగులేదు. ఒకవేళ మాత్రం వ్యతిరేకిస్తే పతనం ఖాయం. విద్యావంతుల ఓటు పరీక్ష ఇప్పుడు ఎదుర్కోవడం కాంగ్రెస్ పార్టీకి ఓకింత ఇబ్బందికరం. గెలిస్తే జోష్ ఉంటుంది. ఓడితే మాత్రం విపక్షాలకు పండగే. ముఖ్యంగా నిరుద్యోగుల్లో ఆగ్రహం ఉండడం కాంగ్రెస్ పార్టీని కలవరపరుస్తోంది. తమ కొంప ముంచుతుందా? అన్న అనుమానం కూడా అధికంగా ఉంది. పట్టభద్రుల ఓటుతో తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ సమీకరణలే మారనున్నాయి. రేవంత్ పాలనపై గ్రాడ్యుయేట్ల తీర్పు ఎలా ఉండబోతుందన్న చర్చ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఉంది.
ఈ ఎన్నికలు భిన్నం…
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతోంది. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన హామీలు.. నిరుద్యోగులు, ఉద్యోగులు, విద్యావంతుల పట్ల అనుసరించిన వైఖరికి ఎన్నికలు ఒక పరీక్షగా నిలవనున్నాయి. సాధారణ ఎన్నికలతో పోలిస్తే భిన్నమైన ఓటింగ్ సరళి ఉండే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. ఓటర్లు ఇచ్చే తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వం పై ఉన్న ప్రజాభిప్రాయానికి అద్దం పట్టనుంది. అందుకే ఈ ఎంఎల్సి పోరును రాజకీయ వర్గాలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక అప్రకటిత రెఫరండంగా అభివర్ణిస్తున్నాయి. విద్యావంతుల తీర్పు ఆసక్తిగా ఉంటుంది. రాష్ట్ర ప్రజల అభిప్రాయానికి దగ్గరగా ఉంటుంది. సాధారణ రాజకీయ అంశాలతో పాటు ప్రభుత్వ విధానాలు, హామీల అమలు, ఉద్యోగ అవకాశాలు, పాలన పారదర్శకత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని ఓట్లు వేస్తారు. ముఖ్యంగా ఉద్యోగ నోటిఫికేషన్లు, ఖాళీల భర్తీ, నిరుద్యోగ భృతి, ఫీజు రియంబర్స్మెంట్, ప్రభుత్వ ఉద్యోగుల సమస్యలు, పెండింగ్ బకాయిలు వంటి అంశాలు ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది. ప్రభుత్వంపై తమకున్న అభిప్రాయాన్ని బ్యాలెట్ ద్వారా వ్యక్తం చేసేందుకు పట్టభద్రులు సిద్ధమవుతున్నారు.
గెలిస్తే తిరుగులేదు…
ఒకవేళ ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిస్తే ఆ పార్టీకి భారీ మైలేజ్ రావడం ఖాయం. ముఖ్యంగా విద్యావంతులు, యువతలో ప్రభుత్వం పై సానుకూల కొనసాగుతుందని సంకేతంగా కాంగ్రెస్ నాయకత్వం ఈ ఫలితాలను ప్రచారం చేసుకునే అవకాశం ఉంటుంది. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు భవిష్యత్ రాజకీయ పోరాటాలకు ఈ విజయం అదనపు బలంగా నిలవనుంది. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు కూడా ఈ ఫలితాలతో గట్టి సమాధానం అవుతుంది. అదే ప్రతికూల ఫలితం వస్తే మాత్రం పూర్తిగా రాజకీయ సమీకరణలే మారిపోతాయి తెలంగాణలో. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత అసంతృత్వ స్వరాలు బయటకు వస్తాయి. నాయకత్వం మార్పు డిమాండ్ కూడా వస్తుంది. దీనిని విపక్షాలు ఒక అస్త్రంగా మలుచుకుని కాంగ్రెస్ ను బలహీనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తారు. అందుకే ఇది రేవంత్ సర్కార్ కు ముమ్మాటికి అగ్నిపరీక్ష. దీనిని దాటుకొని వెళ్తే రేవంత్ నాయకత్వం మరింత బలపడుతుంది కూడా. చూడాలి చివరకు ఏం జరుగుతుందో.
ఇవి కూడ చదవండి:
-
టాలీవుడ్లోకి రష్మిక ఎంట్రీ వెనుక ఆసక్తికర నిజాలు.. మొదట నటించడానికి ఒప్పుకోలేదన్న డైరెక్టర్!
-
హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్.. క్రిమినల్ కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్
-
పవన్ కల్యాణ్, అన్నా లెజినోవా విడాకుల వేళ… రేణూ దేశాయ్ పోస్ట్ నెట్టింట వైరల్!
-
రియల్ ఎస్టేట్లో నష్టాలు.. ఆర్థిక ఇబ్బందులతో వ్యాపారి ఆత్మహత్య
