Homeఆంధ్ర ప్రదేశ్సాయి రెడ్డి పార్టీలో చేరికలు....!

సాయి రెడ్డి పార్టీలో చేరికలు….!

  • వైసీపీకి గుడ్ బై చెబుతున్న సీనియర్లు

  • రాయలసీమ ప్రాంతం నుంచి అధికం

  • ప్రెస్ మీట్ పెట్టి మరి పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన అన్నపురెడ్డి

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి పరాజయం ఎదురయింది. దాని నుంచి బయటపడక ముందే ఆ పార్టీకి పెద్ద ఎత్తున నేతలు గుడ్ బై చెబుతున్నారు. అనూహ్యంగా విజయసాయిరెడ్డి కొత్త పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటిస్తున్నారు. వైసీపీ సీనియర్ నేత అన్నపురెడ్డి విజయభాస్కర్ రెడ్డి అయితే ఏకంగా ప్రెస్ మీట్ పెట్టి.. మెడలో ఉన్న వైసీపీ కండువా తీసి.. పార్టీకి గుడ్ బై చెబుతున్నట్లు ప్రకటించారు. త్వరలో విజయసాయిరెడ్డి స్థాపించనున్న నూతన రాజకీయ పార్టీలు చేరుతున్నట్లు చెప్పారు. అయితే ఒక్క అన్నపురెడ్డి మాత్రమే కాదు.. వైసిపి నుంచి చాలామంది సీనియర్లు విజయసాయిరెడ్డి పార్టీలో చేరబోతున్నట్లు తెలుస్తోంది.

జగన్ పై సంచలన వ్యాఖ్యలు…

అన్నపురెడ్డి భాస్కర్ రెడ్డి పార్టీ నుంచి బయటకు వెళ్తూ.. జగన్మోహన్ రెడ్డి పై సంచలన వ్యాఖ్యలు చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అనేది అసలు ఒక రాజకీయ పార్టీ కాదని.. అందులో ఎవరికీ కనీస సభ్యత్వాలు కూడా ఉండవని ఎద్దేవా చేశారు. పార్టీలో నియామకాలకు సంబంధించి నేతల సంతకాలు కూడా ఉండవని.. లెటర్ ప్యాడ్స్ పై నామమాత్రపు పదవులు పంచుతారని మండిపడ్డారు. రక్తం ధారపోసి జండా మోసిన నిజమైన నాయకులకు, అట్టడుగు స్థాయి కార్యకర్తలకు పార్టీలో ఎలాంటి గుర్తింపు, గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని జగన్ చేజేతులా బొమ్మ చేసుకున్నారని.. ఆనాడు జగన్ వల్ల అధికారం, వ్యాపార ప్రయోజనాలు పొందిన బడా నేతలు ఇప్పుడు పార్టీలో కనిపించడం లేదని విమర్శించారు.

బాంబు పేల్చిన వైనం…

ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూటమి అభ్యర్థులతో ఒప్పందాలు చేసుకున్న విషయాన్ని అన్నపురెడ్డి బయటపెట్టారు. విజయవాడ కార్పొరేషన్ లో మేయర్గా కూటమి అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ గెలవడం వెనుక వైసీపీ నేతల ప్రత్యక్ష సహకారం ఉందని బాంబు పేల్చారు. గుంటూరులో కూడా ఇదే తంతు నడిచింది. వైసీపీలోని నాయకులు కూటమిలోని తమ మిత్రుల విజయం కోసం తెరవెనుక కృషి చేశారన్న విషయాన్ని అన్నపురెడ్డి బయట పెట్టేసారు. స్వయంగా పార్టీలోని పెద్దలే ప్రత్యర్థులకు సహకరిస్తున్నప్పుడు.. సామాన్య కార్యకర్తలు బలి పశువులు కావడం పై ఆవేదన వ్యక్తం చేశారు. కూటమి ఉన్నంతవరకు జగన్ అధికారంలోకి రాలేదని తేల్చి చెప్పారు. ప్రజల కోసం తాను విజయసాయిరెడ్డి పెట్టబోయే కొత్త పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు.

నేతలు ఒక్కొక్కరుగా…

మొన్న మధ్యన ఓ ఇద్దరు నేతలు విజయసాయిరెడ్డి పార్టీలో చేరబోతున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు ఏకంగా వైసీపీలో ఒక సీనియర్ నేత పార్టీలో చేరబోతున్నట్లు బాహాటంగా ప్రకటించారు. అయితే ఈయన ఒక్కరే కాదు రాయలసీమ ప్రాంతంలో చాలామంది నేతలు విజయసాయిరెడ్డి పార్టీ వైపు చూస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. విజయసాయిరెడ్డి సైతం వైసీపీలో ఉన్న అసంతృప్త నేతలను తమ వైపునకు తిప్పుకునేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయిన వైసిపి తీరు చూసి చాలామంది సీనియర్లు ఆవేదనతో ఉన్నారు. ఆ పార్టీకి భవిష్యత్తు లేదనుకున్న వారు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుంటున్నారు. ఈ తరుణంలో ఎక్కువమంది విజయసాయిరెడ్డి పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు