Homeఆంధ్ర ప్రదేశ్నేటి నుంచి విశాఖ‌లో అంత‌ర్జాతీయ స‌దస్సు....! ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు

నేటి నుంచి విశాఖ‌లో అంత‌ర్జాతీయ స‌దస్సు….! ప్ర‌తిష్టాత్మ‌కంగా ఏర్పాట్లు

  • నేటి నుంచి విశాఖలో అంతర్జాతీయ సదస్సు…!

  • నేటి నుంచి రెండు రోజులపాటు నిర్వహణ

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: అంతర్జాతీయ పెట్టుబడుల సమరానికి సాగరనగరం సిద్ధమయింది. ఏపీ పారిశ్రామిక ప్రగతిని సరికొత్త శిఖరాలకు చేర్చే ప్రతిష్టాత్మక 31వ సిఐఐ భాగస్వామ్య సదస్సు-2026 నిర్వహణకు నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. ఈనెల 12 నుంచి రెండు రోజులపాటు రాష్ట్ర ప్రభుత్వం, కాన్ఫరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సంయుక్తంగా ఈ మెగా గ్లోబల్ సమ్మిట్ ను నిర్వహిస్తున్నాయి. నావిగేటింగ్ చేంజ్, టెక్నాలజీ, ట్రస్ట్ అండ్ ట్రేడ్ అనే ప్రధాన ఇతివృత్తంతో జరగనున్న ఈ సదస్సు ద్వారా.. రాష్ట్రానికి వేల కోట్ల రూపాయల దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు సీఎం చంద్రబాబు నేతృత్వంలో అధికార యంత్రాంగం పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తోంది.

భారీగా దేశ, విదేశ ప్రతినిధులు…

విశాఖలో జరుగుతున్న ఈ అంతర్జాతీయ వేదికకు ప్రపంచ నలుమూలల నుంచి వాణిజ్య దిగ్గజాలు తరలివస్తున్నాయి. దాదాపు 59 దేశాలకు చెందిన ప్రతినిధులు, 15 మంది విదేశీ మంత్రులు, 350 మందికి పైగా అంతర్జాతీయ ప్రతినిధులు, 900 మంది అగ్రశ్రేణి భారతీయ పారిశ్రామికవేత్తలు ఈ సదస్సులో పాల్గొనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానమే అజెండాగా.. గ్రీన్ ఎనర్జీ, సెమీ కండక్టర్లు, ఐటీ, కృత్రిమ మేధా, ఫార్మా రంగాల్లో కీలకమైన ఎంవోయూలు కుదరనున్నాయి. లక్షమంది యువతకు ఉపాధి అవకాశాలు సృష్టించే లక్ష్యంతో పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూ కేటాయింపులు, అనుమతుల ప్రక్రియను పూర్తి చేసేందుకు ఏపీఐఐసి పక్కా రోడ్డు మ్యాప్ ను సిద్ధం చేసింది.

అత్యున్నత ఆతిథ్యం…

ఈ సదస్సుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. దేశ విదేశాల నుంచి విచ్చేసి అత్యున్నత స్థాయి వీఐపీలకు అత్యుత్తమ ఆతిథ్యం,, ప్రోటోకాల్, పటిష్ట సెక్యూరిటీ, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, స్టార్ హోటల్ లో వసతి ఏర్పాట్లను అధికారులు సమన్వయం చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక సమ్మిట్ లో భారత ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, కేంద్ర వాణిజ్య శాఖామంత్రి పియుష్ గోయల్, సీఎం చంద్రబాబు తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అంతర్జాతీయ కార్పొరేట్ దిగ్గజాలు రానున్నారు.

ఇదో గేమ్ చేంజర్ గా…

ఈ సదస్సు ఏపీ అభివృద్ధికి గేమ్ చేంజర్ గా నిలుస్తుంది అని భావిస్తున్నారు. విశాఖను గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ డిస్టినేషన్ గా ప్రపంచ పటంలో నిలబెట్టేందుకు ప్రభుత్వం ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. విమానాశ్రయం నుంచి సదస్సు వేదిక వరకు రహదారుల సుందరీ కరణ, బీచ్ రోడ్డు ఆధునీకరణతో నగరం పండుగ శోభను సంతరించుకుంది. నగరవ్యాప్తంగా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అతిపెద్ద పారిశ్రామిక సదస్సు కావడంతో.. భారీగా పెట్టుబడులు రావడం ఖాయమని అంచనాలు ఉన్నాయి.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు