Homeఆంధ్ర ప్రదేశ్దారుణం...రూ.500 ఇవ్వ‌లేద‌ని వ్య‌క్తిపై మ‌రిగే నూనె పోసిన మ‌హిళ‌...!బాధితుడికి తీవ్ర గాయాలు

దారుణం…రూ.500 ఇవ్వ‌లేద‌ని వ్య‌క్తిపై మ‌రిగే నూనె పోసిన మ‌హిళ‌…!బాధితుడికి తీవ్ర గాయాలు

నెల్లూర్‌, క్రైమ్‌మిర్ర‌ర్‌: అప్పుగా రూ.500 తీసుకున్న వ్య‌క్తి తిరిగి ఇవ్వ‌లేద‌ని ఓ మ‌హిళ దారుణ నిర్ణ‌యం తీసుకుంది. ఇచ్చినా డ‌బ్బులు తిరిగి ఇవ్వ‌డం లేదంటూ ఆగ్ర‌హానికి గురైన ఓ మ‌హిళా వ్య‌క్తిపై మ‌రిగే నూనెను పోసింది. దీంతో ఆ వ్య‌క్తికి తీవ్ర గాయాల‌య్యాయి. ఈ దారుణ ఘ‌ట‌న నెల్లూరు రూర‌ల్ మండ‌లం మాద‌రాజుగూడూరులో చోటు చేసుకుంది. దీంతో ఆ ప్రాంతంలో ఒక్క‌సారిగా క‌ల‌క‌లం నెల‌కొంది.

పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి… మాదరాజుగూడూరుకు చెందిన శీనయ్య గతంలో అదే ప్రాంతానికి చెందిన షేక్‌ హసీనా వద్ద రూ.500 అప్పుగా తీసుకున్నాడు. అయితే తాను హసీనా ఇంట్లో పనిచేసి ఆ డబ్బులకు బదులుగా కూలి చెల్లించానని శీనయ్య చెబుతున్నాడు. ఈ విషయమై ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదం కొనసాగుతున్నది. ఈ క్రమంలో శీనయ్య టిఫిన్‌ సెంటర్‌కు వెళ్లగా.. తనకు ఇవ్వాల్సిన రూ.500 ఇంకా ఎందుకు చెల్లించలేదని హసీనా ప్రశ్నించింది. తాను ఇప్పటికే ఇంట్లో పనిచేసి అప్పు తీర్చేశానని శీనయ్య బదులిచ్చాడు. దీంతో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి వాగ్వాదం చోటుచేసుకున్నది.

వాగ్వాదం తీవ్రం కావడంతో హసీనా ఆగ్రహానికి గురైంది. టిఫిన్‌ సెంటర్‌లో కాగుతున్న నూనెను తీసుకుని శీనయ్యపై పోసింది. వేడి వేడి నూనె శరీరంపై పడటంతో పొక్కులు రావడంతో పాటు తీవ్రంగా గాయాలయ్యాయి. ఇది గమనించిన స్థానికులు వెంటనే అతన్ని స్థానిక ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం నెల్లూరు ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. కాగా, శీనయ్య ఒంటిపై 30 శాతం గాయాలు అయ్యాయని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం శీనయ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉందని పేర్కొన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న నెల్లూరు రూరల్‌ పోలీసులు ఆసుపత్రికి చేరుకుని బాధితుడి నుంచి వివరాలు సేకరించారు. ఈ మేరకు షేక్‌ హసీనాపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకుని కోర్టులో హాజరుపరిచినట్లు డీఎస్పీ శ్రీనివాసరావు తెలిపారు.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు