Homeతెలంగాణతెలంగాణలో వలంటీర్ వ్యవస్థ...!

తెలంగాణలో వలంటీర్ వ్యవస్థ…!

  • సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి అందించేందుకు

  • త్వరలో లక్ష మంది నియామకం

  • రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం వలంటీర్ల వ్యవస్థను ప్రారంభించనుందా? సంక్షేమ పథకాలను గడపగడపకు చేర్చేందుకు లక్ష మందితో నూతన వాలంటీర్ల వ్యవస్థను తీసుకురావడానికి కసరత్తు చేస్తోందా? రాష్ట్రవ్యాప్తంగా ఇప్పుడు దీనిపైనే చర్చ నడుస్తోంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పాలనను వికేంద్రీకరించి.. బూత్ స్థాయి యూనిట్ల ద్వారా పౌర సమస్యలను పరిష్కరించాలని భావిస్తున్న సీఎం ఆలోచనలు ఇప్పటివరకు ముందుకు కదల్లేదు. ఇప్పుడు పల్లెల్లో ప్రజాబలం పేరుతో పర్యటనలు ప్రారంభించాలనుకుంటున్నారు. అందుకే సంక్షేమ పథకాల అమలను పర్యవేక్షించేందుకు శాశ్వత యంత్రాంగం అవసరమన్న ఉద్దేశంతోనే.. వాలంటీర్ వ్యవస్థను ప్రారంభించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏపీలో వాలంటీర్ల వ్యవస్థను తెచ్చిన సంగతి తెలిసిందే. చంద్రబాబు సర్కార్ ఆ వ్యవస్థను నిలిపివేసింది. ఇప్పుడు అదే వ్యవస్థను రేవంత్ సర్కార్ ప్రారంభించిన ఉండడం మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది.

దళారుల ప్రమేయం లేకుండా…

తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాల పంపిణీలో మధ్యవర్తుల ప్రమేయం లేకుండా చేయాలన్నది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది. గ్రామాల్లో పింఛన్లు, ఇందిరమ్మ ఇల్లు వంటి ఆరు గ్యారెంటీ పథకాల అమలుపై నిరంతరం నిఘా ఉండనుంది. ప్రజల నుంచి నేరుగా గ్రీవెన్స్లను స్వీకరించి సచివాలయం వరకు తీసుకెళ్లి అనుసంధాన కర్తలుగా వీరు పని చేయగలరు. చదువుకున్న వేలాదిమంది గ్రామీణ యువతకు గౌరవ వేతనంతో కూడిన ఒక నియామక వేదిక లభిస్తుంది. ప్రభుత్వానికి, సామాన్య ప్రజలకు మధ్య ఉండే కమ్యూనికేషన్ గ్యాప్ ను తొలగించి, పాలనను పారదర్శకంగా మార్చేందుకు ఆధునిక తరహా సర్వీస్ వాలంటీర్ల కాన్సెప్ట్ ఒక మంచి ఆలోచనగా కనిపిస్తోంది.

ఆ అపవాదు…

అయితే ఏపీలో వైసీపీ హయాంలో అమలైన ఈ వలంటీర్ వ్యవస్థ తోనే జగన్ కుప్పకూలిపోయారన్న ఆందోళన ఉంది. అధికార పార్టీ ప్రైవేటు సైన్యంగా మారి ప్రజాస్వామ్య వ్యవస్థకే ముప్పుగా పరిణమించింది. ఆ చేదు అనుభవాన్ని ఎవరు మర్చిపోలేదు. వాలంటీర్లు ప్రజల వ్యక్తిగత సమాచారాన్ని సేకరించి.. రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడం, ఓటు బ్యాంకు ను నియంత్రించడం, పథకాల లబ్ధిదారులను బెదిరించిన వంటి దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్న ఆరోపణలు వచ్చాయి. అయితే ఇప్పుడు తెలంగాణలో కూడా ఆ వ్యవస్థను ప్రారంభిస్తే.. వారు ప్రభుత్వ సేవలు కంటే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ క్యాడర్గా మారిపోతారు అన్న భయం విపక్షాల్లో ఉంది.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు