Homeఆంధ్ర ప్రదేశ్పీవీ సింధుకు అరుదైన గౌరవం.. అభినందనలు తెలిపిన వైఎస్ జగన్!

పీవీ సింధుకు అరుదైన గౌరవం.. అభినందనలు తెలిపిన వైఎస్ జగన్!

భారత బ్యాడ్మింటన్ స్టార్, తెలుగు క్రీడాకారిణి పీవీ సింధుకు మరో అరుదైన గుర్తింపు లభించింది. భారత ఒలింపిక్ సంఘం (IOA) అథ్లెట్ల కమిషన్ చైర్‌పర్సన్‌గా ఆమె ఎన్నికయ్యారు. ఈ కీలక బాధ్యతలు చేపట్టడంతో సింధుకు పలువురు ప్రముఖుల నుంచి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పీవీ సింధుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్‌’లో ప్రత్యేక సందేశాన్ని పోస్టు చేశారు.

అథ్లెట్ల కమిషన్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తిగా పీవీ సింధు నిలవడం తెలుగు రాష్ట్రాల ప్రజలకు ఎంతో గర్వకారణమని జగన్ పేర్కొన్నారు. ఈ గుర్తింపు మన ప్రాంతానికి దక్కిన గొప్ప గౌరవమని అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా ఉన్న క్రీడాకారుల సమస్యలు, ఆకాంక్షలను సింధు సమర్థవంతంగా ప్రతిబింబిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

భారత క్రీడారంగ అభివృద్ధికి, క్రీడాకారుల సంక్షేమానికి ఆమె తనదైన శైలిలో కృషి చేస్తారని జగన్ విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్త బాధ్యతల్లో పీవీ సింధు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు.

also read:  హైకోర్టును ఆశ్రయించిన మాజీ సీఎం జగన్‌.. క్రిమినల్ కేసు కొట్టివేయాలని క్వాష్ పిటిషన్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు