Homeతెలంగాణరేవంత్ బహుముఖ వ్యూహం...!

రేవంత్ బహుముఖ వ్యూహం…!

  • ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రజల్లోకి వెళ్లేందుకు నిర్ణయం

  • సంక్రాంతి తర్వాత ప్రజాబలం పేరుతో భారీ కార్యక్రమం

  • గులాబీ పార్టీయే అసలు లక్ష్యం

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నాయి. అక్కడకు పది నెలల వ్యవధిలోనే సార్వత్రిక ఎన్నికలు రానున్నాయి. ఆ రెండు ఎన్నికల్లో సత్తా చాటాలంటే కచ్చితంగా దూకుడు పెంచాల్సిందే. గత ఎన్నికలకు ముందు ఇదే దూకుడుతో అధికారంలోకి రాగలిగారు సీఎం రేవంత్. అయితే ఇప్పుడు విపక్షాలు పట్టు బిగిస్తుండడంతో తన రాజకీయ చతురతను మరింత రాటుదేలేలా వ్యవహరిస్తున్నారు సీఎం రేవంత్. సంక్రాంతి పండుగ ముగిసిన వెంటనే రాష్ట్రంలోని ప్రతి పల్లెను స్వయంగా సందర్శించేలా.. ప్రజాబలం పేరుతో భారీ కార్యక్రమానికి సిద్ధం అవుతున్నారు. తన సొంత నియోజకవర్గమైన కొడంగల్ లో రైతు మేళా, ఇండస్ట్రియల్ ఎక్స్ పో వేదికగా ఆయన చేసిన ప్రకటన పాలన యంత్రాంగాన్ని, రాజకీయ వర్గాలను ఒక్కసారిగా అప్రమత్తం చేసింది. సచివాలయానికి పరిమితం కాకుండా నేరుగా గ్రామాల్లోని గడప తొక్కి.. ప్రజా సమస్యలను స్వయంగా తెలుసుకోవడం.. ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి పథకాల అమలు తీరును క్షేత్రస్థాయిలో సమీక్షించడమే లక్ష్యంగా ఆయన ఈ కార్యక్రమాన్ని రూపొందించారు.

నాటి వైఫల్యాలే అస్త్రం…

గులాబీ పార్టీ పాలన వైఫల్యాలను ప్రధాన అస్త్రంగా చేసుకుని ప్రజల మధ్యకు వెళ్లాలనుకుంటున్నారు సీఎం రేవంత్. నీటిపారుదల అంశాలను రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా ఎంచుకున్నారు. ఎల్ నినో వాతావరణ పరిస్థితులు, తీవ్రమవుతున్న కరువు ముప్పు దృష్ట్యా యాసంగి సీజన్ లో రైతులు ఆరుతడి పంటల వైపు మల్లాలని ఆయన విజ్ఞప్తి చేశారు. సంక్షోభ సమయాల్లో రైతులకు పూర్తి అండగా ఉంటామని భరోసా ఇస్తూనే.. నీటిపారుదల ప్రాజెక్టుల పేరుతో గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను ఎండగట్టే దిశగా పావులు కదిపారు. ముఖ్యంగా కాలేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు, మేడిగడ్డ బ్యారేజీ కొంగుబాటు వ్యవహారాలపై గులాబీ పార్టీ పదేపదే చేస్తున్న విమర్శలను తిప్పుకొట్టేందుకు.. రేవంత్ ఏకంగా సభ వేదికగానే సవాల్ ఎంచుకోవడం కాంగ్రెస్ దూకుడును స్పష్టం చేస్తోంది.

శాసనసభ వేదికగా…

మరోవైపు కాలేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలు, గోదావరి జలాల యాజమాన్యం పై సమగ్రంగా చర్చించేందుకు శాసనసభ ప్రత్యేకంగా రెండు రోజులు సమావేశాలు నిర్వహించాలని.. స్పీకర్ను కోరినట్లు సీఎం రేవంత్ స్వయంగా ప్రకటించారు. ఇది రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఆధునిక సాంకేతిక ఆధారాలు, రికార్డులతో బహిరంగ చర్చకు సిద్ధం కావాలని కెసిఆర్ తో పాటు ఆ పార్టీ అగ్ర నేతలకు రేవంత్ బహిరంగ సవాల్ చేశారు. పది సంవత్సరాలపాటు అధికారం చలాయించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి.. ప్రాజెక్టుల వైఫల్యాల్లోకి నెట్టారు అన్న కాంగ్రెస్ ప్రధాన ఆరోపణలను శాసనసభ వేదికగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నంలో ఉన్నారు రేవంత్. బహుముఖ వ్యూహంతో రేవంత్ రాజకీయం నడుస్తుండగా.. కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలు మాత్రం కలిసి వచ్చేలా లేవు. మరి ఈ విషయంలో రేవంత్ ఎంతవరకు సక్సెస్ అవుతారో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:
  1. నూతన సంవత్సరంలో 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సమరశం ఖం..!
  2.  ఏపీలో ఇక కాంగ్రెస్…!
  3. తెలంగాణ ఆర్థిక స్థితి మరియు సంక్షేమంపై సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
  4.  ప్రేమ పేరుతో వేధింపులు.. ప్రపోజల్ తిరస్కరించిందని డిగ్రీ విద్యార్థినిపై లైంగిక దాడి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు