Homeక్రైమ్ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య

ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు.. కానిస్టేబుల్ ఆత్మహత్య

తెలంగాణలో ఆన్‌లైన్ లోన్ యాప్‌ల వేధింపులు మరో ప్రాణాన్ని బలిగొన్నాయి. అప్పుల వసూలు పేరుతో గుర్తుతెలియని వ్యక్తులు చేస్తున్న బెదిరింపులు, మానసిక వేధింపులు తట్టుకోలేక ఓ పోలీసు కానిస్టేబుల్ ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగారెడ్డి జిల్లాలో కలకలం రేపింది.

మహేశ్వరం మండలం హర్షగూడలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. 8వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న శ్రీను (31) తన నివాసంలో ఉరివేసుకుని ప్రాణాలు కోల్పోయారు.

సమాచారం ప్రకారం.. శ్రీను పలు ఆన్‌లైన్ లోన్ యాప్‌ల ద్వారా రుణాలు తీసుకున్నారు. వాటిని తిరిగి చెల్లించాలంటూ కొంతకాలంగా గుర్తుతెలియని వ్యక్తుల నుంచి ఫోన్ కాల్స్, బెదిరింపులు వస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా, ఆయన మొబైల్‌కు మార్ఫింగ్ చేసిన ఫొటోలు పంపుతూ వేధింపులకు గురిచేసినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ వేధింపుల నేపథ్యంలోనే శ్రీను తీవ్ర మనస్తాపానికి గురైనట్లు సమాచారం. చివరకు ఆయన ఆత్మహత్యకు పాల్పడటంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.

ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆన్‌లైన్ లోన్ యాప్‌ల నిర్వాహకులు, ఫోన్ ద్వారా బెదిరింపులకు పాల్పడిన వ్యక్తుల వివరాలను సేకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు పోలీసుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది.

also read: కరీంనగర్‌లో విషాదం.. భర్త వేధింపులు తట్టుకోలేక వివాహిత ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు