-
దేశంలో బిజెపికి పునాదులు వేసిన బలమైన నేత
-
దేశ ఉప ప్రధానిగా, కేంద్ర హోం శాఖ మంత్రిగా తనదైన ముద్ర
-
101 పడిలోకి లాల్ కృష్ణ అద్వానీ
క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : భారతీయ జనతా పార్టీ అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ, అమిత్ షా ద్వయం పేరు మాత్రమే వినిపిస్తుంది. కానీ మూడు దశాబ్దాల కిందట బిజెపి అంటే అటల్ బిహారీ వాజ్ పాయ్- లాల్ కృష్ణ అద్వానీ పేరు మార్మోగేది. జనసంగ్ పేరుతో రెండు పార్లమెంట్ స్థానాలతో ప్రారంభమైన ప్రస్థానంలో.. అనతి కాలంలోనే భారతీయ జనతా పార్టీ రూపంలో దేశంలో అధికారంలోకి రావడం వెనుక అటల్ బిహారీ వాజ్పేయి – ఎల్కే అద్వానీ ద్వయం కృషి ఉంది. అయితే ఇందులో తెర వెనుక రాజకీయాల్లో సిద్ధహస్తుడు ఎల్కే అద్వానీ. భారత రాజకీయాల్లో సిద్ధాంత పటిమకు, క్రమశిక్షణతో కూడిన నాయకత్వానికి నిలువెత్తు రూపం. దేశానికి ఉప ప్రధానిగా సేవలు అందించిన ఆయన.. ప్రధాని మాత్రం కాలేకపోయారు. అయితే ప్రస్తుతం వయోభారంతో బాధపడుతున్న ఆయన 100 పుట్టినరోజు జరుపుకోవడం విశేషం.
కరాచీలో జన్మించి…
ఎల్కే అద్వానీ 1927 నవంబరు 8న కరాచీలో జన్మించారు. రాష్ట్ర విభజన తర్వాత భారతదేశానికి వచ్చి రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సేవక్ గా ప్రజా జీవితాన్ని ప్రారంభించారు. భారతీయ జనసంఘ్ వ్యవస్థాపక సభ్యులలో ఒకరు. 1970లో పార్లమెంటరీ రాజకీయంలోకి అడుగుపెట్టి.. అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్య పునరుద్ధరణ కోసం జైలు శిక్ష కూడా అనుభవించారు.
బిజెపి వైభవం వెనుక…
భారతీయ జనతా పార్టీ నేటి బలోపేతం వెనుక.. నాటి అద్వానీ కృషి ఉంది. దేశవ్యాప్తంగా బిజెపికి పునాది వేసింది ఆయనే. భారతీయ జనతా పార్టీ ఆవిర్భావం, జాతీయ రాజకీయ ప్రదానస్థితిగా తీర్చిదిద్దడంలో అద్వానీ పాత్ర చారిత్రాత్మకం. 1984 సార్వత్రిక ఎన్నికల్లో కేవలం రెండు స్థానాలకే పరిమితమైన బిజెపిని.. 1989 నాటికి 86 స్థానాలకు.. అటు తరువాత కాలంలో కేంద్రంలో అధికార పీఠాన్ని కైవసం చేసుకునే స్థాయికి చేర్చడంలో ఆయన సంస్కారవంతమైన వ్యూహాలు ఉన్నాయి. ముఖ్యంగా 1990లో ఆయన చేపట్టిన రామ్ రథయాత్ర భారతదేశ రాజకీయాలను, హిందుత్వ సిద్ధాంతవ్యాప్తిని మలుపు తిప్పింది. ఇప్పటికీ అదో ఒక మైలురాయి.
దేశ అంతర్గత భద్రత పెంచిన నేత…
వాజ్పేయి ప్రభుత్వంలో డిప్యూటీ ప్రధానమంత్రిగా, హోం శాఖ మంత్రిగా తనదైన ముద్ర చాటుకున్నారు ఎల్కే అద్వానీ. దేశ అంతర్గత భద్రతను పటిష్టం చేయడం, ఉగ్రవాదం పై ఉక్కు పాదం మోపడం, కీలక మౌలిక వసతుల కల్పనలో ఆయన తన మార్కు పరిపాలన ను చూపించారు. విపక్ష నాయకుడిగా పార్లమెంటులో ప్రజా సమస్యలపై స్పందిస్తూ.. అధికారపక్షాన్ని నిలదీసే సైలీతో ప్రజాస్వామ్య నియమాలను కాపాడడంలో మార్గదర్శి గానిలిచ్చారు.
నిరాడంబరత…
ఆరు దశాబ్దాల రాజకీయ జీవితంలో నిరాడంబరత ఆయన సొంతం. పారదర్శకమైన సుదీర్ఘ ప్రజా జీవితాన్ని గడిపిన అద్వానీ భారత ప్రభుత్వం నుంచి పద్మ విభూషణ్, భారతరత్న లాంటి అత్యున్నత పౌర పురస్కారాలను సైతం అందుకున్నారు. భారత ప్రజాస్వామ్యాన్ని, బిజెపి సిద్ధాంత పునాదులను బలపరిచి.. శతాబ్ది వయస్సులోకి అడుగుపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే అద్వానీ రాజకీయ ప్రస్థానం రాబోయే తరాలకు ఒక స్ఫూర్తిదాయకం.
