Homeక్రైమ్హనుమకొండలో విషాదం.. భర్త మందలించాడని ఆత్మహత్య చేసుకున్న భార్య

హనుమకొండలో విషాదం.. భర్త మందలించాడని ఆత్మహత్య చేసుకున్న భార్య

తెలంగాణలోని హనుమకొండ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త మందలించాడనే మనస్తాపంతో ఓ వివాహిత బలవన్మరణానికి పాల్పడింది. ఐనవోలు ప్రాంతంలో ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన గౌతమ్ పాశ్వాన్, రాధాకుమారి (20) దంపతులు ఉపాధి కోసం నాలుగేళ్ల క్రితం హనుమకొండ జిల్లాకు వలస వచ్చారు. స్థానికంగా కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఆదివారం గౌతమ్ పనికి వెళ్లి తిరిగి ఇంటికి వచ్చేసరికి రాధాకుమారి ఇంటి పనులు చేయకుండా ఫోన్‌లో మాట్లాడుతున్నట్లు గుర్తించాడు.

ఈ విషయంపై ఆమెను గౌతమ్ మందలించినట్లు సమాచారం. దీంతో మనస్తాపానికి గురైన రాధాకుమారి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటనతో కుటుంబంలో విషాదం నెలకొంది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యువతి మృతికి సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకునే పనిలో ఉన్నారు.

also read: టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు