Homeక్రైమ్టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి!

టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో విషాదం.. విషవాయువు పీల్చి ముగ్గురు కార్మికులు మృతి!

తమిళనాడులోని క్రిష్ణగిరి జిల్లాలో తీవ్ర విషాదకర ఘటన చోటుచేసుకుంది. హోసూరు సమీపంలోని టాటా ఎలక్ట్రానిక్స్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు కాంట్రాక్టు కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. ప్లాంట్‌లోని మేరీగోల్డ్ విభాగంలో నానో ఫిల్టర్ ట్యాంక్‌ను శుభ్రం చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

ట్యాంక్‌ను శుభ్రం చేసే క్రమంలో ఒక్కసారిగా విషవాయువు వెలువడటంతో అందులో పనిచేస్తున్న ఓ కార్మికుడు అపస్మారక స్థితిలో చిక్కుకుపోయాడు. అతడిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నించిన మరో ఇద్దరు కార్మికులు కూడా విషవాయువును పీల్చుకున్నారు. దీంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు.

ఈ ఘటనతో ప్లాంట్‌లోని కార్మికులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒకరిని రక్షించేందుకు వెళ్లిన మరో ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోవడంతో అక్కడ విషాద ఛాయలు అలుముకున్నాయి. అసలు ట్యాంక్‌లోకి విషవాయువు ఎలా విడుదలైంది? భద్రతా ప్రమాణాలు పాటించారా? అనే అంశాలపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. ప్రమాదానికి దారితీసిన పరిస్థితులపై సంబంధిత అధికారులు దర్యాప్తు చేపట్టినట్లు సమాచారం. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

also read: అత్యాచారం, బెదిరింపులు, దోపిడీ కేసులో TMC ఎమ్మెల్యే పరేష్‌రామ్ దాస్‌ అరెస్ట్…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు