తెలంగాణలోని కరీంనగర్ జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. భర్త వేధింపులు భరించలేక ఓ వివాహిత తనువు చాలించింది. కరీంనగర్ రూరల్ మండలం ఇరికుల్ల గ్రామానికి చెందిన స్రవంతి (35) సోమవారం తెల్లవారుజామున ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్రవంతికి 11 ఏళ్ల క్రితం కొత్తూరి సంపత్‌తో వివాహమైంది. గత ఆరు నెలలుగా తన తండ్రికి చెందిన ప్లాటును విక్రయించి, వచ్చిన డబ్బులు తనకు ఇవ్వాలంటూ భర్త సంపత్ ఆమెపై ఒత్తిడి తెస్తున్నట్లు ఫిర్యాదు అందింది. ఈ విషయంలో భర్త వేధింపులు ఎక్కువ కావడంతో స్రవంతి తీవ్ర మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలోనే సోమవారం తెల్లవారుజామున ఆమె ఆత్మహత్య చేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిగా పేర్కొన్న సంపత్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు సీఐ నిరంజన్‌రెడ్డి వెల్లడించారు. అతడి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.
also read: హనుమకొండలో విషాదం.. భర్త మందలించాడని ఆత్మహత్య చేసుకున్న భార్య
