Homeఆంధ్ర ప్రదేశ్వంగ‌వీటి రాధా క్రిష్ణ‌ గెలుపు...వైఎస్సార్ సీపీలో చిచ్చు...!

వంగ‌వీటి రాధా క్రిష్ణ‌ గెలుపు…వైఎస్సార్ సీపీలో చిచ్చు…!

  • వంగవీటి రాధా గెలుపు వెనుక ఆ ఇద్దరు…!

  • కొడాలి నాని, వల్లభనేని వంశీ మోహన్ సహకరించినట్లు ఆరోపణలు

  • తెలుగు రాజకీయాల్లో ఇదే హాట్ టాపిక్

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: విజయవాడ మేయర్ గా జనసేన అభ్యర్థి వంగవీటి రాధాకృష్ణ భారీ మెజారిటీతో గెలిచారు. కూటమి అభ్యర్థిగా బరిలో దిగిన ఆయన ఏకపక్ష విజయం సాధించారు. అయితే ఆయన విజయం ఇప్పుడు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చిచ్చు పెడుతోంది. రాధాకృష్ణ గెలుపు కోసం వైసీపీలో ఉన్న ఆయన స్నేహితులు పని చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. దీంతో అందరి దృష్టి ఇప్పుడు కొడాలి నాని, వల్లభనేని వంశీల పై పడింది. వైసీపీలో ఉంటూ.. తమ స్నేహితుడిని గెలిపించేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలు వారిని ఇప్పుడు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. విజయవాడకు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు అన్నపురెడ్డి విజయ భాస్కర్ రెడ్డి దీనిపైనే ఆరోపణలు చేశారు. వైసీపీకి రాజీనామా చేసిన క్రమంలో బాంబు పేల్చారు.

మంచి స్నేహితులు…

వంగవీటి రాధాకృష్ణతో కొడాలి నాని కి, వల్లభనేని వంశీ మోహన్ కు మంచి స్నేహం ఉండేది. 2019 ఎన్నికలకు ముందు వంగవీటి రాధాకృష్ణ వైసీపీకి గుడ్ బై చెప్పారు. ఆ సమయంలో కొడాలి నాని ఆ పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు. అదే సమయంలో వల్లభనేని వంశీ మోహన్ టిడిపిలో కొనసాగి ఆ పార్టీ అభ్యర్థిగా గెలిచారు. అలా గెలిచిన కొద్ది రోజులకే వైసీపీలోకి ఫిరాయించారు. కానీ వంగవీటి రాధాకృష్ణ మాత్రం టిడిపిలో కొనసాగుతూ వచ్చారు. ఈ క్రమంలో ఆయనను వైసీపీలో చేర్పించేందుకు వల్లభనేని వంశీతోపాటు కొడాలి నాని చేయని ప్రయత్నం అంటూ లేదు. రాధాకృష్ణ విషయంలో ఎంత వివాదాలకు ప్రయత్నించిన ఆయన మాత్రం సంయమనం పాటిస్తూ టిడిపిలోనే కొనసాగారు. తాము రాధాకృష్ణ స్నేహితులం అని.. టిడిపిలో ఒక రకమైన గందరగోళం సృష్టించేందుకు వారి చేయని ప్రయత్నం అంటూ లేదు.

లోపయికారీగా సాయం…

2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోయింది. కొడాలి నానితో పాటు వల్లభనేని వంశీ మోహన్ కు దారుణ పరాజయం ఎదురైంది. రాజకీయంగా ఇబ్బందికర పరిస్థితులను వారు ఎదుర్కొన్నారు. అయితే పక్కా రాజకీయ వ్యూహంతో మున్సిపల్ ఎన్నికలకు ముందు టిడిపి నుంచి జనసేనలో చేరారు వంగవీటి రాధాకృష్ణ. జనసేనకు విజయవాడ మేయర్ పదవి ఇవ్వడంతో చంద్రబాబు సూచనతోనే అది జరిగింది. అయితే విజయవాడ మేయర్ గా పోటీ చేసిన వంగవీటి రాధాకృష్ణకు వల్లభనేని వంశీ మోహన్, కొడాలి నాని సహకరించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని వైసిపి నేత ఒకరు బయటపెట్టారు. ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో దీనిపైనే పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

ఇవి కూడ చ‌ద‌వండి:

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు