Homeక్రైమ్విషాదం.. బ్రెడ్, జామ్ తిన్న వ్యక్తి మృతి, ఇద్దరు కుమార్తెలకు అస్వస్థత

విషాదం.. బ్రెడ్, జామ్ తిన్న వ్యక్తి మృతి, ఇద్దరు కుమార్తెలకు అస్వస్థత

కేరళలోని త్రిశూర్‌ జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బ్రెడ్‌, జామ్‌ తిన్న అనంతరం ఓ 60 ఏళ్ల వ్యక్తి మృతి చెందగా.. ఆయన ఇద్దరు కుమార్తెలు అస్వస్థతకు గురయ్యారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళనకు దారితీసింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం రాత్రి వినోద్‌ కుమార్‌ (60), ఆయన ఇద్దరు కుమార్తెలు కలిసి బ్రెడ్‌, జామ్‌ తిన్నారు. ఆహారం తీసుకున్న కొద్దిసేపటికే ముగ్గురికీ వాంతులు, అనారోగ్య లక్షణాలు కనిపించాయి. పరిస్థితి విషమించడంతో వారిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో వినోద్‌ కుమార్‌ ఆదివారం తెల్లవారుజామున మృతి చెందారు. ఆయన ఇద్దరు కుమార్తెలకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు.

బ్రెడ్‌, జామ్‌ కలుషితం కావడం వల్లే ఈ ఘటన జరిగి ఉండొచ్చని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఆహారం వల్లే మృతి సంభవించిందా? లేక మరేదైనా కారణం ఉందా? అనే విషయం ప్రస్తుతం దర్యాప్తులో ఉంది. పోస్టుమార్టం నివేదిక అందిన తర్వాతే వినోద్‌ కుమార్‌ మృతికి అసలు కారణం స్పష్టమవుతుందని పోలీసులు తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. పోస్టుమార్టం నివేదికతో పాటు ఇతర వైద్యపరమైన పరీక్షల ఫలితాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

also read: మణికొండలో చెడ్డీ గ్యాంగ్ హల్‌చల్.. అపార్ట్‌మెంట్‌లో చోరీ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు