Homeఆంధ్ర ప్రదేశ్నగిరి నుంచి రోజా ఔట్...?

నగిరి నుంచి రోజా ఔట్…?

  • కొత్తగా బీసీ నేతకు బాధ్యతలు

  • కీలక నిర్ణయం దిశగా జగన్

 

క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి రోజా పెద్దగా ఇప్పుడు కనిపించడం లేదు. ఆమె రాజకీయాలను విడిచిపెడతారన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మధ్య మధ్యలో వైసిపి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు కానీ.. ఆమె మునుపటిలా రాజకీయాలపై అంతగా ఆసక్తి కనబరచడం లేదన్న టాక్ పొలిటికల్ వర్గాల్లో ఉంది. దానికి కారణం నగిరి నియోజకవర్గంలో ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని జగన్ ప్రోత్సహిస్తున్నట్లు ప్రచారం నడుస్తోంది. అదే జరిగితే పార్టీలో ఉండడం కంటే బయటకు వెళ్లిపోవడమే మేలన్న నిర్ణయానికి ఆమె వచ్చినట్లు తెలుస్తోంది. జగన్ రాయలసీమ పై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. అందులో భాగంగా బలమైన నియోజకవర్గాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని చూస్తున్నారు. గతం మాదిరిగా అభ్యర్థుల ఎంపిక విషయంలో ఎటువంటి మొహమాటలకు పోదలుచుకోలేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి.

అప్పుడప్పుడు కనిపిస్తున్న రోజా…

నగిరి నియోజకవర్గంలో కూడా అప్పుడప్పుడు కనిపిస్తున్నారు రోజా. గత ఎన్నికలకు ముందు నియోజకవర్గంలో ద్వితీయ శ్రేణి క్యాడర్ ఎక్కువగా ఆమెను వ్యతిరేకించింది. ఆపై రోజా కూడా పెద్దగా వారిని కలుపు కెల్లలేదు. అయితే ఇలా అసంతృప్త నేతలంతా సీనియర్ నేత పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అనుచరులు అని తెలుస్తోంది. ఒకానొక సమయంలో పెద్దిరెడ్డి మాటను సైతం రోజా పెద్దగా పట్టించుకోలేదట. అందుకే ఎన్నికల సమయంలో రోజా అభ్యర్థిత్వం విషయంలో పెద్దిరెడ్డి సైతం జగన్మోహన్ రెడ్డికి కీలక సూచనలు చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే రోజా లాంటి నేతకు టికెట్ ఇవ్వకపోతే ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని భావించి జగన్ చివరి నిమిషంలో నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

అందుకే బీసీ నేతకు…

ప్రస్తుతం నగిరి నియోజకవర్గాన్ని ఓ బీసీ నేతకు కట్టబెట్టేందుకు తెరవెనుక మంత్రాంగం జరుగుతున్నట్లు సమాచారం. ఇప్పటికే లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న మంగళగిరి నియోజకవర్గంలో ఇన్చార్జిను మార్చారు జగన్. ఇప్పుడు నగిరి పై కూడా ఫుల్ ఫోకస్ పెట్టారు. నగిరి నుంచి గాలి భాను ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన లోకేష్ తో పాటు చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. రోజురోజుకు ఆ నియోజకవర్గంలో బలం పెంచుకుంటున్నారు. భాను ప్రకాష్ ను ఎదుర్కోవాలంటే బీసీ నేత అయితే సరిపోతారని జగన్ ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. రోజాను తప్పించి ఆ బీసీ నేతకు బాధ్యతలు ఇవ్వడం ఖాయమని సమాచారం.

పార్టీ కార్యక్రమాలకే పరిమితం…

మరోవైపు రోజా ను పార్టీ కార్యక్రమాలకే పరిమితం చేస్తారని వైసీపీ వర్గాల్లో ఒక ప్రచారం ఉంది. అయితే ఆమె మాత్రం ఎమ్మెల్యే పదవితో పాటు మంత్రి పదవి చూశారు గనుక.. ఎట్టి పరిస్థితుల్లో తానే పోటీ చేస్తానని అధిష్టానానికి తేల్చి చెప్పినట్లు తెలుస్తోంది. అయితే ఆమెకు వైసిపి తప్ప మరో ఛాన్స్ లేదు. వైసీపీ టికెట్ ఇవ్వకపోతే ఇండిపెండెంట్గా పోటీ చేసే అవకాశం కూడా లేదు. అందుకే మళ్లీ గ్లామర్ ఫీల్డ్ వైపు వెళ్లిపోవాలన్న ఆలోచనలో ఆమె ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే ఆమె పార్టీ కార్యక్రమాలకు సైతం దూరమై.. సినిమాలతో పాటు టీవీ షోలకు పరిమితం అవుతున్నారని ప్రచారం సాగుతోంది. అందులో ఎంతవరకు అవకాశం ఉందో చూడాలి.

ఇవి కూడ చ‌ద‌వండి:

 

  1. రామాపురంలో ‘పల్లె పండుగ 3.0…! 29న చంద్రబాబు, పవన్ రాక…
  2. మంచిర్యాల జిల్లాలో క‌ల‌క‌లం…! వ్య‌క్తి దారుణ హ‌త్యా…?
  3. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసిన న్యాయవాదులు, ఆర్టీసీ సంఘం నాయకులు
  4. ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డిని కలిసిన న్యాయవాదులు, ఆర్టీసీ సంఘం నాయకులు

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు