Homeక్రైమ్ఇంట్లోనే దంపతుల దారుణ హత్య.. రక్తపు మడుగులో మాజీ సైనికుడు, ఆయన భార్య మృతదేహాలు

ఇంట్లోనే దంపతుల దారుణ హత్య.. రక్తపు మడుగులో మాజీ సైనికుడు, ఆయన భార్య మృతదేహాలు

ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌ జిల్లాలో దంపతుల హత్య కలకలం రేపింది. 58 ఏళ్ల మాజీ సైనికుడు షంషుద్దీన్‌, ఆయన భార్య సడ్డో బేగం ఇంట్లోనే దారుణ హత్యకు గురయ్యారు. ఆదివారం ఉదయం వరకు ఇంటి తలుపులు తెరవకపోవడంతో స్థానికులకు అనుమానం వచ్చింది.

కుటుంబ సభ్యుల సహాయంతో ఇంటి తలుపులు తెరిచి చూడగా.. దంపతులు రక్తపు మడుగులో విగతజీవులుగా కనిపించారు. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిసరాలను పరిశీలించారు. క్లూస్‌ టీమ్‌ను రప్పించి హత్యకు సంబంధించిన ఆధారాలను సేకరించారు.

అనంతరం మృతదేహాలను స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. దంపతుల హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. ఇంట్లోకి నిందితులు ఎలా ప్రవేశించారు? హత్య అనంతరం ఎలా తప్పించుకున్నారు? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఘటనా ప్రాంతానికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. అందులో లభించే ఆధారాల ఆధారంగా నిందితులను గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. హత్యకు సంబంధించి మరిన్ని వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

also read: బాలికపై యువకుడి లైంగిక దాడి.. బాధితురాలు గర్భం దాల్చడంతో విషయం వెలుగులోకి.. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు