-
సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభం
-
సీఎం చంద్రబాబు చేతుల మీదుగా జాతికి అంకితం
-
అమరావతి రైతుల కళ్ళల్లో తొణికిసలాడిన ఆనందం
క్రైమ్ మిర్రర్, ఏపీ బ్యూరో: అమరావతి రాజధాని నిర్మాణంలో కీలక ఘట్టం ఆవిష్కృతం అయింది. పునర్నిర్మాణ ప్రక్రియలు మరో అత్యంత కీలకమైన శ్రీకారం జరిగింది. అమరావతి రాజధానికి ఇతర ప్రాంతాలతో కలుపుతూ రూ. 1519 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన ప్రధాన రవాణా జీవనాడి సీడ్ యాక్సిస్ రోడ్డు తో పాటు పటిష్టమైన స్టీల్ బ్రిడ్జిలను సీఎం చంద్రబాబు నాయుడు జాతికి అంకితం చేశారు. ఉండవల్లి వద్ద ప్రత్యేక శిలాఫలకాన్ని ఆవిష్కరించిన అనంతరం.. ఆయన స్వయంగా కాలినడకన స్టీల్ బ్రిడ్జిలను పరిశీలించారు.
తీవ్ర భావోద్వేగం…
Also Read:ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన జూనియర్ ఎన్టీఆర్.. 2- 3 నెలలు విశ్రాంతి అవసరమని వైద్యుల సూచన
సీఎం చంద్రబాబు భావోద్వేగానికి లోనయ్యారు. ప్రారంభోత్సవ అనంతరం ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి నగరం నిర్మాణమే మొట్టమొదటి విజయంగా అభివర్ణించారు. విభజన తర్వాత నష్టపోయిన ఆంధ్ర రాష్ట్రానికి 25 పార్లమెంట్ స్థానాల మధ్యలో ఉన్న గుంటూరు జిల్లాలో రాజధాని నిర్మించాలని సంకల్పించిన విషయాన్ని గుర్తు చేశారు. నాటి మా పిలుపును, విజన్ ను నమ్మి రాజధాని కోసం భూములు త్యాగం చేసిన అమరావతి రైతులందరికీ పాదాభివందనం చేస్తున్నాను అంటూ చెప్పుకొచ్చారు. నాడు అమరావతిని కొందరు గ్రాఫిక్స్ అంటూ ఎగతాళి చేశారని.. కానీ ఈరోజు ఆ గ్రాఫిక్స్ కళ్ళ ముందు నిజమవుతుంటే.. ఎగతాళి చేసిన వాళ్లంతా సిగ్గుతో తలదించుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు సీఎం చంద్రబాబు.
గత పాలకుల ద్రోహం…
Also Read:రెడ్ కార్పెట్‌పై ఊహించని ముద్దు.. నికిత రావల్ షాకింగ్ రియాక్షన్
గత పాలకులు అమరావతికి చేసిన ద్రోహాన్ని గుర్తు చేశారు చంద్రబాబు. అమరావతి బృహత్ ప్రణాళికకు సహకరించిన సింగపూర్ సంస్థల వేధింపులను చంద్రబాబు ఈ సందర్భంగా గుర్తు చేశారు. అసెంబ్లీ సాక్షిగా నాడు రాజధాని కి 40 వేల ఎకరాల భూమి కావాలని చెప్పిన జగన్.. ఆ తర్వాత మూడు రాజధానులు అంటూ మాట మార్చిన విషయాన్ని కూడా గుర్తు చేశారు. 2019- 24 మధ్య అమరావతిని కాపాడుకోవడానికి రైతులు చేసిన చారిత్రాత్మక పోరాటం ఎప్పటికీ నిలిచిపోతుందన్నారు. లండన్ కు చెందిన నార్మన్ పాస్టర్స్ డిజైన్లతో రూపుదిద్దుకుంటున్న అమరావతిని ప్రపంచస్థాయి నగరంగా నిలబెట్టడమే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు తెలిపారు. తిరుమల తర్వాత అంతటి విశిష్టమైన శ్రీవారి ఆలయంతో పాటు అన్ని రకాల హంగులు సమకూర్చుతున్నట్లు చెప్పారు. అమరావతి తో పాటు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యంగా చెప్పుకొచ్చారు.
సరికొత్త సందడి…
Also Read:రూ.271 కోట్ల పెంట్‌హౌస్.. దేశ రియల్ ఎస్టేట్‌లో సంచలనం!
మరోవైపు సీడ్ యాక్సిస్ రోడ్డు ప్రారంభంతో సరికొత్త సందడి మొదలైంది. రాయపూడి, వెంకటపాలెం, పెనుమాక మీదుగా ఉండవల్లి వరకు నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ రహదారి ఆవిష్కరణతో అమరావతికి అత్యంత ప్రతిష్టాత్మకమైన కనెక్టివిటీ సిద్ధమైంది. మూడో దశలో ఈ మార్గాన్ని మణిపాల్ ఆసుపత్రి వద్ద జాతీయ రహదారికి అనుసంధానం చేసేలా పక్కా ప్రణాళికలు రూపొందించారు. మరోవైపు స్టీల్ బ్రిడ్జిల్లా అందుబాటుతో రాజధాని నగరానికి రాకపోకలు మరింత సులభతరం అయ్యాయి. ప్రారంభోత్సవం జరగడంతో సీడ్ యాక్సిస్ మార్గంలో పూర్తిస్థాయిలో వాహన రాకపోకలు కూడా ప్రారంభమయ్యాయి. అమరావతి రైతుల కళ్ళల్లో ఆనందం కనిపించింది.
