Homeఅంతర్జాతీయంట్రంప్ కోసం రూ. 3,800 కోట్ల విలువైన సరికొత్త విమానం

ట్రంప్ కోసం రూ. 3,800 కోట్ల విలువైన సరికొత్త విమానం

క్రైమ్ మిర్రర్, అంతర్జాతీయం :- అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోసం అధికారులు సరికొత్త ఎయిర్ ఫోర్స్ విమానాన్ని సిద్ధం చేశారు. సుమారు రూ. 3,800 కోట్ల భారీ విలువ చేసే ఈ అత్యంత ఆధునిక విమానాన్ని నిన్న ట్రంప్ లాంఛనంగా ఆవిష్కరించారు.గతేడాది ట్రంప్ పర్యటన సందర్భంగా ఖతర్ ఈ ‘బోయింగ్ 747-8’ విమానాన్ని ఆయనకు గిఫ్ట్‌గా ఇచ్చింది. విదేశాల నుంచి బహుమతిగా వచ్చిన ఈ భారీ విమానాన్ని అమెరికా వైమానిక దళ అధికారులు అధ్యక్షుడి అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దారు.

నార్నే నితిన్ సర్వైవల్ యాక్షన్ డ్రామా ‘NN6’ అనౌన్స్‌మెంట్…!

అత్యాధునిక హంగులు, సౌకర్యాలు:- ఈ బోయింగ్ 747-8 విమానాన్ని అధికారులు అడ్వాన్స్‌డ్ టెక్నాలజీతో, అత్యాధునిక విలాసవంతమైన సౌకర్యాలతో పూర్తిగా మార్పులు చేశారు. అధ్యక్షుడి భద్రతను దృష్టిలో ఉంచుకుని ఈ ఫ్లైట్‌ను సర్వాంగ సుందరంగా, సురక్షితంగా సిద్ధం చేశారు.40 ఏళ్ల నాటి విమానానికి బదులుగా..కాగా, అమెరికా అధ్యక్షుడు ప్రస్తుతం తన అధికారిక పర్యటనల కోసం 40 ఏళ్ల నాటి పాత ‘ఎయిర్‌ఫోర్స్ వన్’ విమానాన్ని వాడుతున్నారు. ఆ పాత విమానం స్థానంలో ఇకపై ఈ కొత్త బోయింగ్ ఫ్లైట్ అమెరికా అధ్యక్షుడికి సేవలందించనుంది.

భార్య పుట్టినరోజు.. సీఎం ప్రత్యక విషెస్!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు