Homeతెలంగాణమేడిగడ్డ నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు? కాంగ్రెస్‌పై వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు!

మేడిగడ్డ నీటిని ఎందుకు ఎత్తిపోయడం లేదు? కాంగ్రెస్‌పై వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర ఆరోపణలు!

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై బీఆర్ఎస్ నేత, బాన్సువాడ ఎమ్మెల్యే, మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఏర్పడిన నీటి కొరత సహజంగా వచ్చిన కరవు కాదని, కాంగ్రెస్ ప్రభుత్వ విధానాల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని ఆరోపించారు.

భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని మేడిగడ్డ బ్యారేజీని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేల బృందం సందర్శించింది. ఈ సందర్భంగా బ్యారేజీ వద్ద నీటి నిల్వలు, ప్రస్తుత పరిస్థితులను పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ప్రశాంత్‌రెడ్డి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.

మేడిగడ్డ వద్ద నీరు అందుబాటులో ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పంపింగ్ చేయకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆయన ఆరోపించారు. మాజీ సీఎం కేసీఆర్‌కు మంచి పేరు వస్తుందనే రాజకీయ కారణాలతోనే నీటిని వినియోగించుకోవడం లేదని విమర్శించారు. ప్రతిరోజూ దాదాపు 22 వేల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలో కలిసిపోతోందని, అదే నీటిని ఎత్తిపోస్తే రైతుల పంటలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని పేర్కొన్నారు.

మేడిగడ్డ బ్యారేజీ పూర్తిగా కూలిపోయిందంటూ ప్రభుత్వం చేస్తున్న ప్రచారాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. బ్యారేజీకి సంబంధించిన 85 పిల్లర్లు పటిష్ఠంగానే ఉన్నాయని ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. ఒకవైపు పంటలు ఎండిపోతున్నా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం బాధాకరమని అన్నారు.

ప్రభుత్వం వెంటనే స్పందించి మేడిగడ్డ నుంచి నీటిని ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు. లేదంటే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నాయకత్వంలో రైతుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘రైతు పోరుబాట’ కార్యక్రమాన్ని చేపడతామని హెచ్చరించారు.

also read: ‘రామాయణ’ సంగీతంపై పాత లక్ష్మణుడి అసంతృప్తి..

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు