Homeఆంధ్ర ప్రదేశ్యలమంచిలిలో టీడీపీ–జనసేన వర్గాల మధ్య ఘర్షణ.. ఎన్నికల ఫలితంతో ముదిరిన వివాదం!

యలమంచిలిలో టీడీపీ–జనసేన వర్గాల మధ్య ఘర్షణ.. ఎన్నికల ఫలితంతో ముదిరిన వివాదం!

అనకాపల్లి జిల్లాలోని యలమంచిలి మున్సిపాలిటీలో కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన వర్గాల మధ్య తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఇరు పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తల మధ్య వివాదం ఘర్షణకు దారితీసింది. దీంతో స్థానికంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది.

తమపై జనసేనకు చెందిన వారు దాడికి పాల్పడ్డారని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. అయితే జనసేన వర్గం మాత్రం మరో వాదనను తెరపైకి తెచ్చింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టీడీపీకి చెందిన కొందరు నేతలు వైసీపీ అభ్యర్థికి మద్దతుగా నిలిచారని జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. ఈ అంశమే ఇరు వర్గాల మధ్య విభేదాలకు ప్రధాన కారణంగా మారినట్లు తెలుస్తోంది.

మున్సిపాలిటీలోని 29వ వార్డులో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కేవలం 13 ఓట్ల స్వల్ప ఆధిక్యంతో విజయం సాధించారు. ఈ ఫలితం నేపథ్యంలో టీడీపీ, జనసేన వర్గాల మధ్య రాజకీయ విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. కూటమి భాగస్వాముల మధ్య నెలకొన్న ఈ వివాదం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

also read: హైదరాబాద్‌లో దారుణం.. ఎయిర్‌హోస్టెస్ శిక్షణ పొందుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు