Homeఆంధ్ర ప్రదేశ్చంద్రబాబుకు తొత్తుగా SEC మారింది: వైయస్ జగన్ తీవ్ర విమర్శలు

చంద్రబాబుకు తొత్తుగా SEC మారింది: వైయస్ జగన్ తీవ్ర విమర్శలు

క్రైమ్ మిర్రర్, ఆంధ్రప్రదేశ్ :-  ఏపీలో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) పూర్తిగా చంద్రబాబు నాయుడికి తొత్తుగా మారిపోయిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా జరుగుతున్న ఎన్నికల్లో పెద్ద ఎత్తున అక్రమాలు జరుగుతున్నాయని, వాటిని నిలువరించడంలో ఎస్ఈసీ విఫలమైందని ఆయన ఆరోపించారు.ప్రత్యేకించి పులివెందుల నియోజకవర్గంలో జరిగిన పరిణామాలను ఆయన ఉదాహరణగా చూపుతూ మండిపడ్డారు. పులివెందులలో ఏకంగా 70 బూతుల్లో రిగ్గింగ్, దౌర్జన్యాలు, అక్రమాలు జరిగాయని, కానీ కేవలం 4 బూతుల్లో మాత్రమే రీపోలింగ్‌కు ఆదేశించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఇంతటి అన్యాయాన్ని, పక్షపాత వైఖరిని ఎక్కడైనా చూశామా అని ఆయన నిలదీశారు. కేవలం అధికార పార్టీకి లబ్ధి చేకూర్చేలా ఎస్ఈసీ వ్యవహరిస్తూ, ప్రజాస్వామ్య వ్యవస్థలను అపహాస్యం చేస్తోందని విమర్శించారు.

భూవీ ఎంపికపై ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి.. సెలెక్టర్ల తీరుపై ప్రశ్నలు!

ఈ ప్రజాస్వామ్య వ్యతిరేక విధానాలపై తాము చూస్తూ ఊరుకోబోమని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని జగన్ స్పష్టం చేశారు. ఎన్నికల్లో జరిగిన ప్రతి అక్రమానికి సంబంధించి పక్కా ఆధారాలను సేకరించి కోర్టుల దృష్టికి తీసుకువెళ్తామని ఆయన తెలిపారు. చట్టం ముందు అందరూ సమానులేనని, ఎంతటివారైనా తప్పు చేస్తే న్యాయపరంగా శిక్ష తప్పదని ఆయన పేర్కొన్నారు. ఎన్ని కుట్రలు, అణచివేత చర్యలు ఎదురైనా చివరికి న్యాయం, ధర్మమే గెలుస్తాయని వైయస్ జగన్ ధీమా వ్యక్తం చేశారు.

దీపావళి వేడుకలు – సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు, నిబంధనలు

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు