Homeక్రీడలుభూవీ ఎంపికపై ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి.. సెలెక్టర్ల తీరుపై ప్రశ్నలు!

భూవీ ఎంపికపై ఇర్ఫాన్ పఠాన్ అసంతృప్తి.. సెలెక్టర్ల తీరుపై ప్రశ్నలు!

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్ :- న్యూజిలాండ్‌తో జరగనున్న టీ20 సిరీస్‌లో అనుభవజ్ఞుడైన పేసర్ భువనేశ్వర్ కుమార్‌ను జట్టులోకి తీసుకోవడంపై టీమిండియా మాజీ ఆల్ రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సెలెక్టర్లు భువీని ఎంపిక చేసి పెద్ద తప్పు చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. భువనేశ్వర్ కుమార్ ఒక అద్భుతమైన బౌలర్ అనడంలో ఎలాంటి సందేహం లేదని, ఆయన ప్రతిభ గురించి అందరికీ తెలుసని ఆయన అన్నారు.

దీపావళి వేడుకలు – సుప్రీంకోర్టు కీలక మార్గదర్శకాలు, నిబంధనలు

అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో టీ20 ప్రపంచకప్ కూడా ముంగిట లేదని, అయినప్పటికీ భువీని జట్టులోకి ఎందుకు ఎంపిక చేశారో తమకు అంతుచిక్కడం లేదని ఇర్ఫాన్ పఠాన్ ప్రశ్నించారు. సీనియర్ ఆటగాళ్లకు పెద్దపీట వేయడం వల్ల యువ ఆటగాళ్లకు తగినన్ని అవకాశాలు కోల్పోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.ఈ నిర్ణయం వల్ల మయాంక్ యాదవ్, ప్రిన్స్ యాదవ్ వంటి నూతన యువ పేస్ బౌలర్లకు న్యూజిలాండ్ పిచ్‌లు, కండిషన్లపై ఆడే అవకాశం దక్కకుండా పోయిందని ఆయన విమర్శించారు. భవిష్యత్తు దృష్ట్యా యువ ఆటగాళ్లకు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లలో ఎక్కువ అవకాశాలు ఇస్తేనే వారు రాటుదేలుతారని, ఇలాంటి సిరీస్‌లను యంగ్ టాలెంట్‌కు వేదికగా మలచాలని పఠాన్ హితవు పలికారు.

కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు: ‘ఈవీఎంలు హ్యాక్ అయితే రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యారు?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు