Homeతెలంగాణకాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు: ‘ఈవీఎంలు హ్యాక్ అయితే రేవంత్ రెడ్డి సీఎం ఎలా...

కాంగ్రెస్‌పై అమిత్ షా తీవ్ర విమర్శలు: ‘ఈవీఎంలు హ్యాక్ అయితే రేవంత్ రెడ్డి సీఎం ఎలా అయ్యారు?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ :- హైదరాబాద్ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా ఈవీఎంల హ్యాకింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలను ఆయన గట్టిగా తిప్పికొట్టారు. “ఒకవేళ ఈవీఎంలు నిజంగానే హ్యాక్ అయి ఉంటే, తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏ విధంగా ముఖ్యమంత్రి అయ్యారు?” అని ప్రశ్నించారు.ఢిల్లీలో కాంగ్రెస్ నిర్వహించిన ‘ఓట్ బచావో’ ర్యాలీపై కూడా ఆయన మండిపడ్డారు. అది ఓట్లను రక్షించే ర్యాలీ కాదని, దేశంలోకి వచ్చే చొరబాటుదారులకు మద్దతుగా చేపట్టిన ర్యాలీ అని ఆరోపించారు. దేశవ్యాప్తంగా 13 కోట్ల ఓట్ల తొలగింపు జరిగిందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ పచ్చి అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని అమిత్ షా తీవ్రంగా ధ్వజమెత్తారు.

వృద్దురాలి అనుమానాస్ప‌ద మృతి…!

తెలంగాణ ప్రజలు మార్పును కోరుకుంటున్నారని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దె దించి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చే సమయం ఆసన్నమైందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణాలో రానున్న రోజుల్లో బిజెపి జెండా ఎగరడం ఖాయమని స్పష్టం చేశారు.

బిగ్ అల‌ర్ట్‌…..ముంచుకొస్తున్న ముర‌సు తుఫాన్…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు