Homeఆంధ్ర ప్రదేశ్రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై పోలీసుల కాల్పులు?

రాప్తాడు విద్యార్థినిపై దాడి కేసులో కీలక పరిణామం.. నిందితుడిపై పోలీసుల కాల్పులు?

క్రైమ్ మిర్రర్ ; అనంతపురం జిల్లా రాప్తాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థినిపై దాడి చేసిన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో నిందితుడిగా భావిస్తున్న హేమంత్‌పై పోలీసులు కాల్పులు జరిపినట్లు సమాచారం. ఈ ఘటనలో అతడికి గాయాలైనట్లు వార్తలు వెలువడుతున్నాయి.

వివరాల్లోకి వెళ్తే.. శనివారం ఉదయం పాఠశాలలో పదో తరగతి చదువుతున్న బాలికపై హేమంత్ చెట్లు నరికేందుకు ఉపయోగించే రంపం యంత్రంతో దాడి చేశాడు. ఈ దాడిలో బాలిక తీవ్రంగా గాయపడింది. ఘటన అనంతరం నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ క్రమంలో ఆత్మకూరు అటవీ ప్రాంతంలో అతడు ఉన్నట్లు సమాచారం అందడంతో ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకుని వెతుకులాట చేపట్టాయి.

గాలింపు సమయంలో పోలీసులకు హేమంత్ ఎదురుపడగా, అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో పోలీసులు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో గాయపడిన అతడిని పోలీసులు వెంటనే అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. అయితే పోలీసుల కాల్పులకు సంబంధించిన పూర్తి వివరాలు, ఘటన జరిగిన పరిస్థితులపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
also read ;అచ్చంపేట హైవేపై ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులు స్పాట్ డెడ్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు