హైదరాబాద్లో మరోసారి డ్రగ్స్ కలకలం రేపాయి. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా పరిధిలోని నాచారం ప్రాంతంలో పోలీసులు భారీగా మాదకద్రవ్యాలను పట్టుకున్నారు. బెంగళూరు నుంచి హైదరాబాద్కు డ్రగ్స్ అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టారు.
ఎల్బీనగర్ ఎస్వోటీ పోలీసులు, నాచారం పోలీసులతో కలిసి సంయుక్తంగా తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి సుమారు రూ.20 లక్షల విలువైన 210 గ్రాముల ఎండీఎంఏ (MDMA) మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు.
ఈ డ్రగ్స్ రవాణా వెనుక మరికొందరి ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా భావిస్తున్న ఉదయ్ ప్రస్తుతం పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అతడి ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. డ్రగ్స్ సరఫరా నెట్వర్క్కు సంబంధించిన పూర్తి వివరాలను రాబట్టేందుకు విచారణ కొనసాగుతోంది.
also read: దియా మిర్జాకు హైకోర్టు అండ.. తొలగించిన వీడియోను మళ్లీ పోస్టు చేయాలని బీఎంసీకి ఆదేశం!
