Homeక్రైమ్హైదరాబాద్‌లో దారుణం.. ఎయిర్‌హోస్టెస్ శిక్షణ పొందుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారం

హైదరాబాద్‌లో దారుణం.. ఎయిర్‌హోస్టెస్ శిక్షణ పొందుతున్న ఇద్దరు బాలికలపై అత్యాచారం

హైదరాబాద్‌లో మహిళల భద్రతపై ఆందోళన కలిగించే ఘటన వెలుగులోకి వచ్చింది. ఎయిర్‌హోస్టెస్ శిక్షణ తీసుకుంటున్న ఇద్దరు బాలికలపై ఇద్దరు యువకులు అత్యాచారానికి పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. బాలికలకు మద్యం తాగించి ఈ అఘాయిత్యానికి ఒడిగట్టినట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైనట్లు సమాచారం.

ఈ ఘటనకు సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఈ ఘటనకు దారితీసిన పరిస్థితులు, నిందితులతో బాధిత బాలికలకు ఉన్న పరిచయం తదితర అంశాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

నగరంలో చోటుచేసుకున్న ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. బాధిత బాలికలకు న్యాయం జరిగేలా పోలీసులు తదుపరి దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

also read: చిల్లర వివాదం.. కండక్టర్ ప్రవళిక మృతి.. నిరసనగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బస్సుల బంద్!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు