Homeతెలంగాణకేటీఆర్ సరికొత్త మేకోవర్: వచ్చే ఏడాది పాదయాత్రకు సన్నద్ధం

కేటీఆర్ సరికొత్త మేకోవర్: వచ్చే ఏడాది పాదయాత్రకు సన్నద్ధం

క్రైమ్ మిర్రర్,హైదరాబాద్:- తెలంగాణ రాజకీయాల్లో మరో ఆసక్తికర పరిణామం చోటుచేసుకోబోతోంది. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు (కేటీఆర్) త్వరలో సరికొత్త లుక్‌తో, నయా పనితీరుతో ప్రజల ముందుకు రానున్నారు. వచ్చే ఏడాది ఆయన చేపట్టబోయే భారీ పాదయాత్ర కోసమే ఈ ప్రత్యేక మేకోవర్ జరుగుతున్నట్లు సమాచారం.

కొత్త రూపం.. నయా పనితీరు..
కేవలం డ్రెస్సింగ్ స్టైల్, గెటప్ మాత్రమే కాకుండా తన పనితీరును కూడా పూర్తిగా మార్చుకునే పనిలో కేటీఆర్ పడ్డారు. క్షేత్రస్థాయిలో ప్రజలకు మరింత చేరువయ్యేలా, వారిలో ఆదరణ మరింత పెంచుకునేలా ఆయన సిద్ధమవుతున్నారు. ముఖ్యంగా బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించే శైలిని కూడా మరింత ఆకర్షణీయంగా మార్చనున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ భవిష్యత్ రాజకీయ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు, వ్యూహాలను రచించేందుకు ఏకంగా ఒక స్పెషల్ టీమ్ కూడా అపాయింట్ అయినట్లు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ప్రజలతో, పార్టీ శ్రేణులతో మరింత అందుబాటులో ఉండేందుకు, వారితో నేరుగా మమేకమయ్యేందుకు వీలుగా తెలంగాణ భవన్‌లో కేటీఆర్ కోసం ప్రత్యేకంగా ఒక కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు.మొత్తం మీద రాబోయే పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి బలంగా వెళ్లేందుకు కేటీఆర్ అన్ని విధాలా సన్నద్ధమవుతున్నట్లు తాజా పరిణామాలను బట్టి స్పష్టమవుతోంది.

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరం?

వందే భారత్ స్లీపర్‌కు గ్రీన్ సిగ్నల్.. తెలుగు రాష్ట్రాల ప్రయాణికులకు భారీ ఊరట!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు