తాడేపల్లిగూడెం రూరల్ మండలం ఎల్.అగ్రహారం టిడ్కో గృహ సముదాయంలో ఓ మహిళ హత్యకు గురైన ఘటన తీవ్ర కలకలం రేపింది. యాదాల మంగ (28) అనే మహిళ అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందింది. ప్రాథమిక సమాచారం ప్రకారం.. వివాహేతర సంబంధం విషయంలో గెడ్డం సందీప్‌తో మంగకు గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఆమెను పీక నులిమి హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
శుక్రవారం తెల్లవారుజామున మంగ అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని విజయకుమారి గుర్తించారు. వెంటనే ఈ విషయాన్ని మృతురాలి సోదరి రత్నమ్మకు తెలియజేశారు. సమాచారం అందుకున్న రత్నమ్మ అక్కడికి చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు.
సోదరి ఫిర్యాదు ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మంగ మృతదేహాన్ని ఏరియా ఆస్పత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించేందుకు చర్యలు చేపట్టారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు, హత్యకు దారితీసిన పరిస్థితులపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.
also read: షారుఖ్, అజయ్ దేవగణ్‌కు FDA నోటీసులు.. మరో నటుడిపై చట్టపరమైన విచారణ
