ఢిల్లీ, క్రైమ్‌మిర్రర్: ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ ఎమ్మెల్యే, ఆ పార్టీ రాష్ర్ట ఉపాధ్యక్షురాలు పూజా పాల్ బ్యాంక్ ఖాతా నుంచి సుమారు 1.55లక్షలు మాయమైనట్లు ఆమె తెలిపారు. ఎవరో మోసపూరితంగా డబ్బును విత్‌డ్రా చేసినట్లు తెలిపారు. ఈ విషయం 14న ఆమెకు తెలిసింది.దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయగా.. శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కౌశాంబి జిల్లా చైల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పూజా పాల్‌కు ప్రయాగ్‌రాజ్‌లోని ధూమన్‌గంజ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్‌లో ఖాతా ఉంది. ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 13 వరకు తన ఖాతా నుంచి పలుమార్లు డబ్బు విత్‌డ్రా చేసినట్లు పోలీసులకు ఆమె తెలిపారు.
Also Read:భారత ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్: జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచిన ‘మూడీస్’
తన ఐఫోన్ 17 ఎయిర్‌ను ఎవరో హ్యాక్ చేసి ఉండవచ్చని, తన బ్యాంకింగ్, వ్యక్తిగత సమాచారాన్ని దుర్వినియోగం చేసి నగదు ఉపసంహరించి ఉండవచ్చని ఆమె అనుమానం వ్యక్తం చేశారు. ప్రస్తుతం పోలీసులు సైబర్ సెల్ సహాయంతో ఆమె మొబైల్ ఫోన్, ఫోన్ పే, యూపీఐ, బ్యాంక్ ఖాతా వివరాలను పరిశీలిస్తున్నారు. కాగా ఇప్పటి వరకు జరిగిన అన్ని లావాదేవీలపై పూర్తి దర్యాప్తు చేయాలని ఆమె కోరారు.అలాగే తన మొబైల్ ఫోన్‌కు టెక్నికల్ ఆడిట్ నిర్వహించడంతో పాటు, అన్ని ట్రాన్సాక్షన్ ఐడీలు, బ్యాంకు ఖాతా వివరాలను పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. భవిష్యత్తులో తన ఖాతా నుంచి ఎలాంటి అనధికారిక ఉపసంహరలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, మోసపూరితంగా విత్‌డ్రా చేసుకున్న సుమారు రూ.1.55 లక్షలను తిరిగి వచ్చేలా చూడాలని కోరారు. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read:సౌది అరేబియా వారం రోజుల్లో 300 సార్లు దాడులు చేసింది…! హౌతీలు
