కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వివాహానికి సంబంధించిన వివాదం వెలుగులోకి వచ్చింది. పెంకు ఫణికుమార్ అనే వ్యక్తి తనను వివాహం చేసుకుని ఆ తర్వాత ముఖం చాటేశాడంటూ జయలక్ష్మి అనే మహిళ ఆందోళనకు దిగింది. తనకు న్యాయం చేయాలని కోరుతూ ఆమె నిరసన చేపట్టింది.
జయలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు 30న విజయవాడలోని దుర్గమ్మ ఆలయంలో ఫణికుమార్తో తనకు వివాహం జరిగింది. పెళ్లి అనంతరం భర్త తనకు దూరంగా వెళ్లిపోయాడని ఆమె ఆరోపించింది. దీంతో న్యాయం కోసం అతని ఇంటికి వెళ్లినట్లు తెలిపింది.
అయితే అత్తారింటికి వెళ్లిన సమయంలో తనపై దాడి చేసి అవమానించారని జయలక్ష్మి ఆరోపించింది. తనకు జరిగిన అన్యాయంపై న్యాయం చేయాలని ఆమె కోరుతోంది.
మరోవైపు ఫణికుమార్ తండ్రి స్పందిస్తూ.. ఫణికుమార్కు వివాహం జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. ఈ వ్యవహారంపై పెద్దల సమక్షంలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఈ వివాహ వివాదంపై ఇరు కుటుంబాల మధ్య చర్చల అనంతరం ఎలాంటి నిర్ణయం వెలువడుతుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.
also read: బొత్స కు బంపర్ ఆఫర్…! ఫ్యామిలీ ప్యాకేజీ ప్రకటించిన జగన్…
