Homeక్రైమ్స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు ఇక చెక్.. టెలికాం సంస్థలకు 'ట్రాయ్' కఠిన నిబంధనలు!

స్పామ్ కాల్స్, మెసేజ్‌లకు ఇక చెక్.. టెలికాం సంస్థలకు ‘ట్రాయ్’ కఠిన నిబంధనలు!

ప్రస్తుత రోజుల్లో మొబైల్ వినియోగదారులను స్పామ్ కాల్స్, ప్రమోషనల్ మెసేజ్‌లు తీవ్రంగా వేధిస్తున్న సంగతి తెలిసిందే. వీటిని అరికట్టేందుకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (TRAI – ట్రాయ్) కీలక నిర్ణయం తీసుకుంది. స్పామ్ కాల్స్ బెడదకు శాశ్వత చెక్ పెట్టేలా తన నిబంధనలను మరింత కఠినతరం చేస్తూ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా ఇకపై స్పామ్ కాల్స్, అవాంఛిత మెసేజ్‌లు పంపే మొబైల్ నంబర్లను స్వయంగా టెలికం సర్వీస్ ప్రొవైడర్లే గుర్తించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది.

ట్రాయ్ నిబంధనల ప్రకారం.. ఒకే వ్యక్తి లేదా ఏదైనా సంస్థ పేరు మీద తీసుకున్న ఐదు అంతకంటే ఎక్కువ నంబర్లు 10 రోజుల వ్యవధిలో స్పామ్‌గా తేలితే, సదరు నంబర్లపై టెలికాం సంస్థలు వెంటనే లోతైన విచారణ జరుపుతాయి. ఆ విచారణలో నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలితే సదరు వినియోగదారులపై కఠిన చర్యలు తీసుకుంటారు. వెంటనే ఆయా నంబర్లకు కేవైసీ (KYC) రీవెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టడంతో పాటు అవసరమైతే కనెక్షన్‌ను పూర్తిగా కట్ చేస్తారు.

ఇదే సమయంలో ప్రముఖ కాలింగ్ ఐడెంటిఫికేషన్ యాప్స్ అయిన ట్రూకాలర్ వంటి వాటికి కూడా ట్రాయ్ కీలక ఆదేశాలు జారీ చేసింది. అధికారిక ప్రయోజనాల కోసం ఉపయోగించే 140, 1600, 1601 సిరీస్‌ నంబర్లతో వచ్చే కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లోనూ బ్లాక్ చేయడం గానీ, లేదా వాటిని స్పామ్‌గా ట్యాగ్ చేయడం గానీ చేయకూడదని ట్రాయ్ తన మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. దీంతో సామాన్య వినియోగదారులకు స్పామ్ కాల్స్ నుంచి భారీ ఉపశమనం లభించనుందని భావిస్తున్నారు.

ఖైరతాబాద్ లో గెలిచేదెవరు?

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు