Homeక్రైమ్తీవ్ర విషాదం...! గ‌ణేష్ నిమ‌జ్జ‌నం నుంచి తిరిగి వ‌స్తుండ‌గా ఘోర రోడ్డు ప్ర‌మాదం...! స్పాట్‌లోనే న‌లుగురు..

తీవ్ర విషాదం…! గ‌ణేష్ నిమ‌జ్జ‌నం నుంచి తిరిగి వ‌స్తుండ‌గా ఘోర రోడ్డు ప్ర‌మాదం…! స్పాట్‌లోనే న‌లుగురు..

శంషాబాద్‌, క్రైమ్ మిర్రర్‌: రంగా రెడ్డి జిల్లా శంషాబాద్ మండ‌లంలోని పాల‌మాకుల గ్రామ స‌మీపంలో హైద‌రాబాద్‌-బెంగుళూరు జాతీయ ర‌హ‌దారిపై శుక్ర‌వారం రాత్రి ఘోర రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ ఘ‌గ‌ట‌న గ‌నేష్ నిమ‌జ్జ‌నానికి వెళ్లి తిరిగి వ‌స్తుండ‌గా ఈ రోడ్డు ప్ర‌మాదం చోటు చేసుకుంది. ఈ విషాద ఘ‌ట‌న‌లో ఒకే కుటుంబానికి చెందిన న‌లుగురు అక్క‌డిక‌క్క‌డే మృతి చెందిన ఘ‌ట‌న ఆప్రాంతంలో ఒక్క‌సారిగా తీవ్ర విషాదం చోటు చేసుకుంది.

Also Read:మాజీ మంత్రి అవంతి యూటర్న్…!

పోలీసుల వివరాల ప్రకారం.. మహబూబ్‌నగర్‌ జిల్లా నవాబ్‌పేట మండలంలోని మేట్టుగడ్డ తండాకు చెందిన కుటుంబ సభ్యులు గణేశ్‌ నిమజ్జనం కోసం శంషాబాద్‌కు వచ్చారు. కార్యక్రమం ముగించుకుని ఇన్నోవా కారులో తిరిగి వెళ్తుండగా పాలమాకుల సమీపంలో వాహనం అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కల్వర్టును బలంగా ఢీకొట్టింది. ప్రమాదం ధాటికి కారు తీవ్రంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో కేతావత్‌ లింబ్య (54), ఆయన భార్య కేతావత్‌ జమున (45), కత్రావత్‌ మాన్సింగ్‌ (48), కేతావత్‌ వాస్రామ్‌ (45) అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుల్లో ముగ్గురు వ్యాపారాలు చేసేవారు కాగా, జమున గృహిణిగా ఉన్నారు.

డ్రైవ‌ర్‌కు తీవ్ర గాయాలు…

Also Read:విజయ్ ను కలవర పెడుతున్న కమ్యూనిస్టులు…!

ఈ రోడ్డు ప్ర‌మాదంలో కారు డ్రైవర్‌ సబావత్‌ అశోక్‌ తీవ్రంగా గాయపడటంతో వెంటనే శంషాబాద్‌లోని ట్రైడెంట్‌ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఒకేసారి మృతి చెందడంతో వారి స్వగ్రామంలో తీవ్ర విషాదఛాయలు అలుముకున్నాయి. గణేశ్‌ నిమజ్జనం అనంతరం ఇంటికి తిరిగి వస్తుండగా జరిగిన ఈ విషాద ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Also Read:ఆర్టీసీ క్రాస్ రోడ్స్ స్టీల్ బ్రిడ్జిపై నుంచి దూకి యువకుడి ఆత్మహత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు