-
రికార్డుల ప్రాథమిక పరిశీలన పూర్తయిన వెంటనే రంగంలోకి..
-
రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కెసిఆర్ ఫామ్ హౌస్ కేంద్రంగా ఉన్న ఎర్రవల్లి భూముల వివాదంలో విచారణను ప్రారంభించింది. అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించడంతో రెవెన్యూ యంత్రాంగం వేగంగా రంగంలోకి దిగింది. కెసిఆర్ ఫామ్ హౌస్ పరిసరాల్లో వివాదంలో ఉన్న సుమారు 385 ఎకరాల భూమిలో ప్రభుత్వ భూమి, అసైన్డ్ భూములు ఎంత మేర కలిసి ఉన్నాయో 30 రోజుల్లో గా తేల్చాలని అసెంబ్లీ వేదికగా సీఎం ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం సిద్దిపేట జిల్లా మార్కుక్ తాసిల్దార్ కార్యాలయంలో అధికారులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సంబంధిత రెవెన్యూ ఫైళ్లను క్షుణ్ణంగా పరిశీలించారు.
జెట్ స్పీడ్ తో ప్రభుత్వం…
Also Read: సమంత కొత్త జర్నీ.. గర్భంతోనే ‘మాస్టర్‌చెఫ్ తమిళ్’ షూటింగ్
కెసిఆర్ ఫామ్ హౌస్ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం శరవేగంగా స్పందిస్తోంది. దూకుడును కనబరుస్తోంది. సీఎం ఆదేశాల నేపథ్యంలో ఎటువంటి జాప్యం లేకుండా రెవెన్యూ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. గజ్వేల్ ఆర్డీవో చంద్రకళ రెవెన్యూ ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ పరిధిలోని సర్వే నెంబర్లు, పాత పహానిలు, భూముల రిజిస్ట్రేషన్ దస్తావేజులు, ప్రభుత్వ సీలింగ్ లేదా అసైన్డ్ భూముల రికార్డులను అధికారులు సమగ్రంగా బేరిజు వేశారు. వివాదాస్పద భూములపై క్షేత్రస్థాయిలో డిజిటల్ సర్వేలు చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లను రెవెన్యూ బృందాలు సిద్ధం చేస్తున్నాయి.
ముందుగా నోటీసులు ఇచ్చి…
Also Read: నా తండ్రి ప్రోత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను- జేసన్ సంజయ్
మరోవైపు కెసిఆర్ తో పాటు సంబంధిత భూ యజమానులకు నోటీసులు జారీ చేసేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. రికార్డుల ప్రాథమిక పరిశీలన పూర్తయిన వెంటనే, సర్వే నిర్వహణకు ముందు చట్టబద్ధంగా నోటీసులు జారీ చేసేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భూ సర్వే చట్టం ప్రకారం నోటీసులు అందజేసి.. వారి సమక్షంలోనే సర్వేయర్లతో కలిసి సరిహద్దులను కొలవాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. నోటీసుల వ్యవహారంపై లీగల్ అంశాలను పరిశీలిస్తున్న యంత్రాంగం.. ఒకటి రెండు రోజుల్లోనే నేరుగా కెసిఆర్ కు నోటీసులు అందజేసే అవకాశం ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది. మొత్తానికి అయితే రాబోయే రోజుల్లో తెలంగాణలో సరికొత్త రాజకీయ ప్రకంపనలు రేగే ఛాన్స్ కనిపిస్తోంది.
