Homeజాతీయంవిజయ్ ను కలవర పెడుతున్న కమ్యూనిస్టులు...!

విజయ్ ను కలవర పెడుతున్న కమ్యూనిస్టులు…!

  • తమిళనాడు ఉప ఎన్నికల్లో పోటీ

  • ప్రభుత్వానికి మద్దతు ఇస్తూనే సొంత రాజకీయం

  • బహుముఖ పోటీతో సర్వత్రా ఉత్కంఠ

 

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : తమిళనాడు సీఎం విజయ్ కు కొత్త చిక్కు వచ్చి పడింది. ప్రభుత్వ ఏర్పాటుకు సహకరించిన కమ్యూనిస్టులు ఇప్పుడు నేరుగా విజయ్ తో తలపడుతున్నారు. విజయ్ నేతృత్వంలోని టివికే ప్రభుత్వానికి అసెంబ్లీలో వెలుపల నుంచి మద్దతు కొనసాగిస్తూనే.. అక్టోబర్ 6న జరగనున్న మధురాంతకం, ధారాపురం ఉప ఎన్నికల్లో వామపక్షాలు స్వతంత్రంగా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నాయి. అధికారంలో ఉన్న ప్రభుత్వాన్ని తాము కూల్చబోమని హామీ ఇస్తూనే.. అదే ప్రభుత్వ అభ్యర్థులను ఓడించాలని ప్రజలను కోరేందుకు సిద్ధమవుతున్నాయి.

ఏ కూటమిలో లేకుండా…

Also Read:దారుణం.. ఐడెంటిటీ కార్డు ట్యాగ్‌తో భార్యను హత్య చేసి భర్త పరారీ

ప్రస్తుతం వామపక్షాలు తమిళనాడులోని ఏ కూటమిలో కూడా లేవు. అటు టీవీకే కూటమిలో గానీ.. ఇటు డిఎంకె కూటమిలో గానీ.. అన్నా డీఎంకే – బిజెపి ఫ్రంట్ లో కానీ తాము లేము అని.. ప్రత్యేక రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వెళ్తున్నామని చెబుతున్నాయి వామపక్షాలు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రజాతీర్పును గౌరవించేందుకే.. గవర్నర్ పాలన రాకుండా బీజేపీ పరోక్ష పెత్తనాన్ని అడ్డుకోవడానికి తాము విజయ్ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతు ఇచ్చామని చెప్పుకొస్తున్నారు. ఉప ఎన్నికలు అనేవి ప్రభుత్వం మారే ఎన్నికలు కావని.. కాబట్టి తమ పోటీ వల్ల ప్రభుత్వ మనుగడకు ఎలాంటి ముప్పు ఉండదని సమర్థించుకుంటున్నారు. విజయ్ పాలనపై వామపక్షాలకు భిన్న వైఖరి ఉంది. గత 120 రోజుల పాలనలో కొన్ని అంశాలపై విభేదాలు ఏర్పడడంతోనే వామపక్షాలు పోటీకి సిద్ధపడినట్లు తెలుస్తోంది.

ప్రభుత్వ విధానాలతో…

Also Read:16 ఏళ్ల బాలిక‌పై సామూహిక అత్యాచారం, హ‌త్య‌

తమిళనాడులో విజయ్ ప్రభుత్వం కొలువుదీరి దాదాపు 120 రోజులు అవుతుంది. అయితే ప్రభుత్వం విదేశీ పెట్టుబడులకు అధిక ప్రాధాన్యం ఇవ్వడం.. స్థానిక ఎంఎస్ఎమ్ఈలను విస్మరించడం, అసెంబ్లీ కేవలం వాగ్వాదాలకు పరిమితం చేయడం వంటి కారణాలతో వామపక్షాలు ఆగ్రహంగా ఉన్నాయి. వీటన్నింటికీ తోడు అన్నాడీఎంకే తరఫున గెలిచి రాజీనామా చేసి వెంటనే టీవీకేలో చేరిన వారిని మళ్లీ ఇప్పుడు బరిలో దింపడాన్ని ఫిరాయింపులుగానే చూస్తున్నాయి వామపక్షాలు.

అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే…

Also Read:గోవిందరావుపేట తహసీల్దార్‌పై ఏసీబీ ట్రాప్‌.. రూ.14 వేల లంచం తీసుకుంటుండగా పట్టివేత

తమిళనాడులో ఉప ఎన్నికలు అన్ని పార్టీలకు ప్రతిష్టాత్మకమే. టీవీ కే, అన్నా డిఎంకె- బిజెపి పోటీలో ఉన్నాయి. ఇప్పుడు రంగంలోకి వామపక్షాలు రావడంతో పోటీ రసవత్వంగా మారనుంది. క్షేత్రస్థాయిలో కార్యకర్తల కు మాత్రం ఇది పెను పరీక్ష. ప్రజల వద్దకు వెళ్లి విజయ్ ప్రభుత్వం కొనసాగాలి.. కానీ ఈ రెండు స్థానాల్లో విజయ్ అభ్యర్థులను ఓడించాలి అని వామపక్షాల కార్యకర్తలు ప్రచారం చేయడం ఇబ్బందికరమే. ఇది సాధారణ ఓటర్లకు రుచించని అంశం. సిద్ధాంత పరంగా స్వతంత్ర ఉనికి కోసం చాటుకోవాలనే తాపత్రయం వామపక్షాలకు కొత్త ఊపిరి పోస్తుందా? లేకుంటే బలహీనతలను బయట పెడుతుందా అనేది అక్టోబర్ ఆరు ఉప ఎన్నికల ఫలితాలతో తేలనుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు