Homeజాతీయంభారత ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్: జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచిన ‘మూడీస్’

భారత ఆర్థిక వ్యవస్థకు బిగ్ బూస్ట్: జీడీపీ వృద్ధి అంచనాను 7 శాతానికి పెంచిన ‘మూడీస్’

ప్రముఖ అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ ‘మూడీస్’ భారతదేశ ఆర్థిక వృద్ధిపై విశ్లేషిస్తూ కీలక ప్రకటన విడుదల చేసింది. రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సరానికి గాను భారత జీడీపీ (GDP) వృద్ధి రేటు 7 శాతంగా నమోదవుతుందని కొత్తగా అంచనా వేసింది. గతంలో భారత ఆర్థిక వ్యవస్థ కేవలం 6 శాతం మేర మాత్రమే వృద్ధి చెందుతుందని భావించిన మూడీస్, ప్రస్తుత పరిణామాల దృష్ట్యా తన పాత అంచనాను పెంచడం విశేషం.వాతావరణంలో చోటుచేసుకుంటున్న ఎల్నినో ప్రభావం వలన ఆహార పదార్థాలు మరియు ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉందని ఏజెన్సీ తన నివేదికలో పేర్కొంది. దీని ఫలితంగా ద్రవ్యోల్బణం పెరిగి, ప్రజల కొనుగోలు శక్తి తగ్గడం సహా ఆర్థిక గ్రోత్‌పై కొంత ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని తెలిపింది.

వైఎస్ షర్మిల కుమార్తె వైఎస్ అంజలి రెడ్డి వివాహ వేడుకలు: నవంబర్ 25న ఘనంగా పెళ్లి!

అయినప్పటికీ, ఇటువంటి పలు అంతర్జాతీయ సవాళ్లను తట్టుకుంటూ జీడీపీ వృద్ధి రేటు అంచనాను ఏకంగా 7 శాతానికి పెంచడం శుభపరిణామమని నిపుణులు అంటున్నారు. ఇది భారత ఆర్థిక వ్యవస్థ కలిగిన స్థిరత్వానికి, వేగంగా పుంజుకుంటున్న దృఢత్వానికి స్పష్టమైన నిదర్శనమని ఆర్థిక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రపంచ స్థాయి ప్రతికూలతల మధ్య కూడా భారత మార్కెట్ సురక్షితంగా దూసుకుపోతుందనడానికి ఈ రిపోర్టే ప్రధాన ఆధారమని పేర్కొన్నారు.

భారత మహిళా క్రికెటర్ల జెర్సీలపై బీసీసీఐ లోగో మిస్సవ్వడానికి అసలు కారణం ఏంటో తెలుసా? పూర్తి వివరాలు ఇవే!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు