Homeతెలంగాణకేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద రెండో రోజు భూ సర్వే.. 388 ఎకరాలపై అధికారుల దృష్టి

కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద రెండో రోజు భూ సర్వే.. 388 ఎకరాలపై అధికారుల దృష్టి

సిద్దిపేట జిల్లా మార్కూక్‌ మండలం ఎర్రవల్లి గ్రామంలోని మాజీ సీఎం కేసీఆర్‌కు చెందిన ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో రెవెన్యూ అధికారుల భూ సర్వే రెండో రోజూ కొనసాగింది. ఫామ్‌హౌస్‌కు ఆనుకుని ఉన్న భూములను అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఎర్రవల్లి, వెంకటాపూర్‌, వరదరాజపూర్‌ గ్రామాల సరిహద్దుల్లో ఉన్న సర్వే నంబర్‌ 325పై అధికారులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. ఈ సర్వే నంబర్‌లో మొత్తం 388 ఎకరాల భూమి ఉన్నట్లు అధికారులు పరిశీలిస్తున్నారు. గురువారం మూడు గ్రామాల సరిహద్దులను గుర్తించిన రెవెన్యూ బృందాలు.. శుక్రవారం ఆయా భూములకు సంబంధించిన పాత రైతుల వివరాలు, ప్రస్తుతం ఉన్న రెవెన్యూ రికార్డులను సేకరించాయి.

ఏడీ సుదర్శన్‌ రాథోడ్‌, డీఐ సేవియా నాయక్‌ పర్యవేక్షణలో నాలుగు ప్రత్యేక బృందాలు సర్వే ప్రక్రియను చేపట్టాయి. క్షేత్రస్థాయిలో సేకరించిన వివరాలను రెవెన్యూ రికార్డులతో సరిపోల్చి అధికారులు నివేదిక సిద్ధం చేస్తున్నట్లు సమాచారం.

అయితే ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ పరిసరాల్లో ఈ భూ సర్వేను చేపట్టడానికి గల పూర్తి కారణాలు ఏమిటన్న దానిపై అధికారుల నుంచి స్పష్టమైన సమాచారం ఇంకా వెలువడలేదు. సర్వే పూర్తయిన తర్వాత అధికారులు సమర్పించే నివేదికలో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

also read: శంషాబాద్‌ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు