Homeక్రైమ్నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదం.. సర్వీస్ రివాల్వర్ పేలి ఆర్‌ఐ మృతి

నిజామాబాద్ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదం.. సర్వీస్ రివాల్వర్ పేలి ఆర్‌ఐ మృతి

నిజామాబాద్ జిల్లా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. విధులు ముగించుకున్న అనంతరం తన సర్వీస్ రివాల్వర్‌ను శుభ్రం చేస్తుండగా ప్రమాదవశాత్తు తుపాకీ పేలింది. ఈ ఘటనలో రిజర్వ్ ఇన్‌స్పెక్టర్ (ఆర్‌ఐ) హెచ్. సతీశ్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.

పోలీసుల ప్రాథమిక సమాచారం ప్రకారం.. విధులు పూర్తైన తర్వాత హెడ్‌క్వార్టర్స్‌లోనే సతీశ్ తన సర్వీస్ ఆయుధాన్ని శుభ్రం చేసుకుంటున్నారు. ఆ సమయంలో అనుకోకుండా రివాల్వర్ పేలడంతో తీవ్ర గాయాలై ఆయన మృతి చెందినట్లు తెలుస్తోంది.

సమాచారం అందుకున్న నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య వెంటనే పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌కు చేరుకుని ఘటనపై వివరాలు తెలుసుకున్నారు. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలను అధికారులు పరిశీలిస్తున్నారు.

ఆర్‌ఐ సతీశ్ మృతితో నిజామాబాద్ జిల్లా పోలీసు శాఖలో విషాదం నెలకొంది. సహచర అధికారులు, సిబ్బంది తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.

also read: కేసీఆర్‌ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌ వద్ద రెండో రోజు భూ సర్వే.. 388 ఎకరాలపై అధికారుల దృష్టి

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు