Homeక్రైమ్షారుఖ్, అజయ్ దేవగణ్‌కు FDA నోటీసులు.. మరో నటుడిపై చట్టపరమైన విచారణ

షారుఖ్, అజయ్ దేవగణ్‌కు FDA నోటీసులు.. మరో నటుడిపై చట్టపరమైన విచారణ

మహారాష్ట్రలో నిషేధిత గుట్కా, పాన్‌ మసాలా ఉత్పత్తులను ప్రచారం చేశారనే ఆరోపణలు బాలీవుడ్ నటులకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయి. ఈ వ్యవహారంలో నటులు షారుఖ్ ఖాన్, అజయ్ దేవగణ్, టైగర్ ష్రాఫ్‌లకు మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) ఆగస్టు 11న నోటీసులు జారీ చేసింది.

ఈ నోటీసులపై ఇద్దరు నటులు FDAకి తమ స్పందన తెలియజేసినట్లు కమిషనర్ తుకారాం ముంధే వెల్లడించారు. ప్రకటనల్లో కనిపించడం లేదా ప్రచారం చేయడం తమ బాధ్యత కాదని, సంబంధిత ఉత్పత్తుల తయారీదారులదే బాధ్యత అని వారు పేర్కొన్నట్లు తెలిపారు.

అయితే మరో నటుడు మాత్రం FDA నోటీసుకు ఇప్పటివరకు స్పందించలేదని అధికారులు వెల్లడించారు. దీంతో ఆ నటుడికి సంబంధించిన అంశంపై FDA చట్టపరమైన విచారణను ప్రారంభించినట్లు సమాచారం.

నిషేధిత పొగాకు ఉత్పత్తుల ప్రచారానికి సంబంధించిన నిబంధనల ఉల్లంఘన జరిగిందా అనే అంశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు. విచారణలో వెల్లడయ్యే అంశాల ఆధారంగా సంబంధిత వ్యక్తులపై తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

also read: గోపన్‌పల్లిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం .. ఇళ్ల నుంచి పరుగులు తీసిన స్థానికులు

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు