Homeక్రైమ్ఎన్టీటీపీఎస్‌ చన్నీటి కాలువలో మహిళ మృతదేహం.. తల, చేతులు, కాళ్లు మాయం

ఎన్టీటీపీఎస్‌ చన్నీటి కాలువలో మహిళ మృతదేహం.. తల, చేతులు, కాళ్లు మాయం

ఎన్టీటీపీఎస్‌ చన్నీటి కాలువలో గుర్తుతెలియని మహిళ మృతదేహం కలకలం రేపింది. శుక్రవారం రాత్రి ఎన్టీటీపీఎస్‌ స్టేజ్‌–2 సమీపంలో మృతదేహాన్ని గుర్తించిన అధికారులు ఇబ్రహీంపట్నం పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు కాలువ నుంచి మృతదేహాన్ని వెలికితీశారు.

మృతదేహాన్ని పరిశీలించగా.. తలతో పాటు చేతులు, కాళ్లు కూడా కనిపించకపోవడంతో పోలీసులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేశారు. మృతురాలి వయస్సు సుమారు 30 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండొచ్చని ప్రాథమికంగా గుర్తించారు.

ఎవరైనా మహిళను హత్య చేసి, మృతదేహాన్ని కాలువలో పడేసి ఉంటారనే కోణంలో పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని విజయవాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి, గుర్తింపు కోసం చర్యలు చేపట్టారు. మహిళ మృతికి సంబంధించిన పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.

also read: తాడేపల్లిగూడెంలో దారుణం.. మహిళ దారుణ హత్య

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు