Homeక్రీడలుఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరం?

ఇంగ్లాండ్‌తో వన్డే సిరీస్‌కు హార్దిక్ పాండ్యా దూరం?

క్రైమ్ మిర్రర్, స్పోర్ట్స్:- గాయం కారణంగా ఇప్పటికే అఫ్గానిస్థాన్‌తో జరుగుతున్న వన్డే సిరీస్‌కు దూరమైన టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యాకు సంబంధించి మరో అప్‌డేట్ వచ్చింది. పాండ్యా ఇంకా గాయం నుంచి పూర్తిగా కోలుకోనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో రాబోయే జూలైలో ఇంగ్లాండ్ తో జరగనున్న వన్డే సిరీస్‌కు కూడా అతడు దూరమయ్యే అవకాశాలు ఉన్నట్లు క్రికెట్ వర్గాల్లో వార్తలు వస్తున్నాయి.

ఫిట్‌నెస్‌కు మరింత సమయం.. హార్దిక్ పాండ్యా మళ్లీ మైదానంలో అడుగుపెట్టడానికి, పూర్తి ఫిట్‌నెస్‌ సాధించేందుకు ఇంకా సమయం పడుతుందని బెంగళూరులోని ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ (CoE) వర్గాలు తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతం అక్కడే ఆయన తన రికవరీ ప్రక్రియను కొనసాగిస్తున్నారు.

2-3 రోజుల్లో కోహ్లీకి ఫిట్‌నెస్ టెస్ట్.. మరోవైపు గాయం వల్ల అఫ్గాన్ సిరీస్‌కు దూరమైన మరో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌పైనా కీలక సమాచారం ఉంది. కోహ్లీకి రాబోయే 2-3 రోజుల్లో ఫిట్‌నెస్ టెస్ట్ జరగనుంది. ఒకవేళ ఆయన పూర్తిస్థాయిలో కోలుకుని, ఈ టెస్టులో పాసైతే ఇంగ్లాండ్ పర్యటనకు అందుబాటులో ఉండే అవకాశం ఉంది.

నార్నే నితిన్ సర్వైవల్ యాక్షన్ డ్రామా ‘NN6’ అనౌన్స్‌మెంట్…!

Vengal Reddy
Vengal Reddyhttps://crimemirror.com/
2025 నుంచి "క్రైమ్ మిర్రర్" లో సీనియర్ సబ్‌ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. గత 4 ఏళ్లుగా వివిధ దినపత్రికల్లో-వెబ్ సైట్-సోషల్ మీడియా ఆప్స్' లలో కంటెంట్ క్రియేటర్ గా పని చేసిన అనుభవం ఉంది. పాలిటిక్స్‌, టెక్నాలజీ, లైఫ్‌ స్టైల్‌, బిజినెస్‌కు సంబంధించిన కంటెంట్‌ను రాయగలను.

తాజావార్తలు