Homeక్రైమ్బిట్రగుంటలో అక్రమ మద్యం విక్రయాలు.. 30 బాటిళ్లు స్వాధీనం

బిట్రగుంటలో అక్రమ మద్యం విక్రయాలు.. 30 బాటిళ్లు స్వాధీనం

ప్రకాశం జిల్లా జరుగుమల్లి పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అక్రమ మద్యం విక్రయాలపై పోలీసులు చర్యలు చేపట్టారు. బిట్రగుంట గ్రామంలో మద్యం అక్రమంగా విక్రయిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన పల్లపాటి సాంబశివరావు (55) వద్ద తనిఖీలు చేపట్టగా.. అక్రమంగా విక్రయించేందుకు ఉంచిన Old Admiral Brandyకి చెందిన 30 మద్యం బాటిళ్లు గుర్తించారు.

పోలీసులు మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని సాంబశివరావుపై కేసు నమోదు చేశారు. ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా మద్యం విక్రయించడం, రవాణా చేయడం వంటి చర్యలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని జరుగుమల్లి పోలీసులు హెచ్చరించారు.

also read: విద్యుత్ కంచెకు బాలుడు, కుక్క బలి.. ప్రకాశం జిల్లాలో విషాదం

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు