Homeజాతీయంప్రకాష్ రాజ్ కు ఎంత కష్టం?!.. ధర్మస్థల ఆరోపణలపై ధర్మ సందేహం!!

ప్రకాష్ రాజ్ కు ఎంత కష్టం?!.. ధర్మస్థల ఆరోపణలపై ధర్మ సందేహం!!

  • ప్రశ్నిస్తే తట్టుకోలేకపోతున్న విలక్షణ నటుడు
  • వారంతా పెయిడ్ అంటూ ఆరోపణలు

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్ : ధర్మస్థల కుట్ర కేసులో నటుడు ప్రకాష్ రాజ్ తప్పించుకోలేరా? ఆయన చిక్కుకోవడం ఖాయమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. సమకాలీన రాజకీయ అంశాలపై ప్రశ్నిస్తూ ఉంటారు ప్రకాష్ రాజ్. ఇప్పుడు తనకు ప్రశ్నలు ఎదురవుతుండడంతో ఏం చెప్పాలో ఆయనకు పాలు పోవడం లేదు. ధర్మస్థల ల్యాండ్ వ్యవహారాల్లో.. ఆయన ప్రమేయం ఉన్న కుట్రలు ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ముఖ్యంగా మాస్క్ మాన్ చిన్నయ్య ఇచ్చిన తాజా స్టేట్మెంట్ నేరుగా ప్రకాష్ రాజ్ మెడకే చుట్టుకున్నట్టు కనిపిస్తోంది. ఇన్ని రోజులపాటు నీతులు చెప్పిన ఈ విలక్షణ నటుడి అసలు రంగు బయటపడిందని.. చట్ట పరంగా ఆయన ఇరుక్కోవడం ఖాయమని ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే ఇన్ని రోజులు ప్రశ్నలతో ఇతరులను ఉక్కిరిబిక్కిరి పెట్టించిన ప్రకాష్ రాజ్ ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్ కు నానా తంటాలు పడుతున్నారు.

కన్నడంలో ప్రెస్ మీట్ పెడితే..

ధర్మస్థల వివాదంలో తన పేరు వచ్చిన క్రమంలో.. కన్నడ వాదనను వినిపించేందుకు కర్ణాటకలో ప్రకాష్ రాజు ఒక ప్రెస్ మీట్ పెట్టారు. కానీ కన్నడ సీనియర్ జర్నలిస్టులు ఒక ఆట ఆడేసుకున్నారు ప్రకాష్ రాజ్ తో. ధర్మస్థల వివాదంపై గట్టిగా నిలదీసే సరికి సమాధానం చెప్పలేక ఇబ్బంది పడ్డారు. అయితే ఇప్పుడు ధర్మస్థలపై కుట్ర అన్న మాట పక్కన పెట్టి.. కన్నడ జర్నలిస్టులు అడిగే ప్రశ్నలన్నీ పెయిడ్ మీడియా స్క్రిప్ట్ అని కొత్త పల్లవి అందుకున్నారు. తాను మాత్రం దేశభక్తుడినని.. కన్నడ జర్నలిస్టులందరూ కొత్త ముద్ర వేసేందుకు ఆయన ప్రయత్నించారు. అయితే ఇన్ని రోజులు తెలుగు రాజకీయాలతో ఒక ఆట ఆడుకున్నారు ప్రకాష్ రాజ్. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ విషయంలో అదే పనిగా.. అనవసర జోక్యంతో ఇబ్బందులు పెట్టారు. ఇప్పుడు గానీ తెలుగు మీడియాతో మాట్లాడితే అసలుకే ఎసరు వస్తుందని ప్రకాష్ రాజు కు తెలుసు. అందుకే యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. తనకు అనుకూలమైన జర్నలిస్టుని ఎంచుకుని.. ఆయనకు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. ముందే ప్రశ్నలు, ముందే సమాధానాలు అనుకొని కూర్చున్న ఫిక్సింగ్ ఇంటర్వ్యూ గా మార్చేశారు. ఇదిగో నా సమాధానం అంటూ తెలుగు మీడియాను సంతృప్తి పరిచినట్టు సంకేతాలు పంపించారు.

తెలుగు యూట్యూబ్ ఛానల్ ద్వారా వివరణ..

ధర్మస్థల ల్యాండ్ వివాదంపై కుట్ర కోణంలో ప్రకాష్ రాజ్ పై ఆరోపణలు వచ్చాయి. కన్నడ సీనియర్ జర్నలిస్టులందరూ ముందుకు వచ్చి కడిగేశారు ప్రకాష్ రాజును. కానీ అనుకున్న సమయం కంటే ముందుగా ప్రెస్ మీట్ ని ముగించి వెళ్ళిపోయారు. అయితే ఇప్పుడు తాజా ఇంటర్వ్యూలో.. కన్నడ సీనియర్ జర్నలిస్టులను పెయిడ్ జర్నలిస్టులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు. తాను అడ్డగోలుగా రాజకీయ కామెంట్స్ చేయవచ్చు. దానికి జస్ట్ ఆస్కింగ్ అని ట్యాగ్ పెట్టుకోవచ్చు. తాను ప్రశ్నిస్తే సమాజ ఉద్ధరణ. ఇతరులు ప్రశ్నిస్తే మాత్రం పెయిడ్ వ్యవహారం అనే విలనిజం చూపించారు ప్రకాష్ రాజ్.

వైసీపీ జర్నలిస్టుతో..

ఇక్కడ కూడా తన రాజకీయ ఆసక్తిని బయట పెట్టుకున్నారు ప్రకాష్ రాజ్. ఏపీలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉండే ఒక జర్నలిస్టును.. యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పెట్టుకొని.. తనకు అనుకూలమైన ప్రశ్నలు వేయించుకొని.. సమాధానం చెబుతూ తిప్పి కొట్టే ప్రయత్నం చేశారన్నది ఇట్టే తెలిసిపోతుంది. తాను రాజకీయ ప్రేరేపితమైన జోలికి పోనని.. సమాజ హితంగా ఆలోచిస్తానని గొప్పగా చెప్పుకొచ్చేవారు ప్రకాష్ రాజ్. అటువంటి ప్రకాష్ రాజ్ ఇప్పుడు ధర్మస్థల వివాదంలో అడ్డంగా బుక్కయ్యారు. ఇప్పుడు ఆయనను ప్రశ్నించేవారు పెయిడ్ జర్నలిస్టులను తేల్చేస్తున్నారు. అయితే మునుపటిలా ప్రకాష్ రాజ్ కామెంట్స్ ప్రాధాన్యం ఉండే అవకాశం లేదు.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

తాజావార్తలు