క్రైమ్ మిర్రర్,అమరావతి:- ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తన సతీమణి నారా భువనేశ్వరికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఆమెను ప్రశంసిస్తూ సోషల్ మీడియా వేదికగా ఆయన ఒక భావోద్వేగభరితమైన ట్వీట్ చేశారు.”ఒక అద్భుతమైన వ్యక్తిని నా జీవిత భాగస్వామిగా పొందాను. ఒక మంచి భార్యగా, ఆదర్శవంతమైన తల్లిగా, విజయవంతమైన వ్యాపారవేత్తగా ఆమె మా జీవితాలకు వెలుగునిచ్చారు. సమాజంలో సానుకూల మార్పు తీసుకురావాలనే ఆమె నిరంతర తపన ఎంతోమందికి స్ఫూర్తిదాయకం” అని ముఖ్యమంత్రి చంద్రబాబు తన ట్వీట్‌లో కొనియాడారు.మరోవైపు, రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ కూడా తన తల్లి భువనేశ్వరికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తన తల్లి ప్రేమ, ఆమె ఇచ్చిన దిశానిర్దేశం తన జీవితంలో ఎన్నో గొప్ప మార్పులు తీసుకువచ్చాయని లోకేశ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
జనసేనలోకి అవంతి శ్రీనివాస్.. చేరికల కమిటీ గ్రీన్ సిగ్నల్!!
నార్నే నితిన్ సర్వైవల్ యాక్షన్ డ్రామా ‘NN6’ అనౌన్స్‌మెంట్…!