Homeఆంధ్ర ప్రదేశ్జాతీయ పార్టీగా జనసేన...!

జాతీయ పార్టీగా జనసేన…!

  • ఢిల్లీ వేదికగా సౌండ్ చేసిన పవన్ కళ్యాణ్

  • దేశ శ్రేయస్సు కోసమే పుష్కర కాలం కిందట పార్టీ ఏర్పాటు చేసినట్లు ప్రకటన

  • దక్షిణాది రాష్ట్రాల నుంచి భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు

క్రైమ్ మిర్రర్, సెంట్రల్ డెస్క్: జనసేన పుష్కరకాలం కిందట ఆవిర్భవించింది. సుదీర్ఘకాలం పోరాటం చేసి ఏపీలో అధికారంలోకి వచ్చింది. ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా మారింది. పార్టీ ఏర్పాటు చేసి పుష్కరకాలం పూర్తయిన చారిత్రాత్మక సందర్భాన్ని పురస్కరించుకుని దేశ రాజధాని ఢిల్లీ వేదికగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించింది.

Also Read: OTTలో ఈ వారం వినోదాల జాతర…! –

ప్రఖ్యాత అశోక హోటల్ లో సోమవారం ‘సేన ప్రస్థానం జాతీయ సమైక్యత కోసం’ అనే అంశంపై ఈ సదస్సు జరిగింది. అధినేత పవన్ కళ్యాణ్ తో పాటు పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి జనసేనలో చేరిన నేతలంతా హాజరయ్యారు. తమిళనాడు తో పాటు కేరళ కు చెందిన నేతలు సైతం హాజరు కావడం విశేషం.

  • పక్కా పొలిటికల్ ప్లాన్..

పక్కా పొలిటికల్ ప్లాన్ తోనే ఢిల్లీలో జనసేన ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు స్పష్టమైంది. సమైక్యత భావాలతో ముందుకు వెళుతున్న పవన్ కళ్యాణ్ తన పార్టీని జాతీయ పార్టీగా విస్తరించే క్రమంలో ఈ సమావేశం ఏర్పాటు చేసినట్లు పొలిటికల్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సులో జనసేన అధినేత పవన్ ప్రసంగం మీడియాతో పాటు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది.

పార్టీ ప్రారంభ దినాలను గుర్తు చేసుకుంటూ పవన్ కళ్యాణ్ భావోద్వేగానికి లోనయ్యారు. 12 ఏళ్ల కిందట నేను జనసేన పార్టీని స్థాపించినప్పుడు భవిష్యత్తులో అధికారం వస్తుందో రాదో కూడా తనకు తెలియని విషయాన్ని గుర్తు చేశారు. అధికారంలోకి వస్తామన్న స్వార్థంతో తాను పార్టీ పెట్టలేదని.. దేశ సమగ్రత, అఖండత, సమాజ శ్రేయస్సు తప్ప నా మైండ్లో మరే ఇతర ఆలోచనలు ఉండేవి కావన్నారు.

Also Read: Good News For Students: విద్యార్థులకు భారీ శుభవార్త…!

కేవలం ఎన్నికల్లో గెలవడం, పదవులు పంచుకోవడం మాత్రమే రాజకీయాలు కావని.. ప్రాంతీయ ఆకాంక్షలను గౌరవిస్తూనే.. దేశ సార్వభౌమాధికారాన్ని కాపాడే ఒక జాతీయ భావజాలం గల రాజకీయ శక్తిగా నిలబడటమే జనసేన అసలు సిద్ధాంతం అని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్.

  • తెలంగాణ ప్రస్తావన..

మరోసారి తెలంగాణ అంశాన్ని ప్రత్యేకంగా ప్రస్తావించారు పవన్ కళ్యాణ్. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును జనసేన ఎన్నడు అడ్డుకోలేదని.. కానీ నాడు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని విభజించిన కుట్రపూరిత తీరును మాత్రమే పాము తప్పు పట్టిన విషయాన్ని ప్రస్తావించారు. నాటి విభజన గాయాలనుంచి నేటి వరకు కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న అప్రజాస్వామిక ధోరణిలో ఎలాంటి మార్పు రాలేదని మండిపడ్డారు.

తెలంగాణ గడ్డపై ప్రజాస్వామ్య బద్దంగా జరగాల్సిన జనసేన బహిరంగ సభను ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా అడ్డుకున్న విషయాన్ని కూడా ప్రస్తావించారు పవన్. ప్రాంతీయ సెంటిమెంట్ల పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసే కాంగ్రెస్ మార్కు వైఖరిని.. దేశ సమగ్రత కోసం జనసేన ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు.

Also Read: తెలంగాణ క్యాబినెట్ లోకి విజయశాంతి…!

మరోవైపు దేశంలో రాజకీయ విచ్ఛిన్నకర పరిస్థితులు, అంతర్గత సవాళ్లపై పవన్ కళ్యాణ్ లోతైన విశ్లేషణ చేశారు. పుష్కర కాలంలో జనసేన ఎదుర్కొన్న ఒడిదుడుకులు, దేశభక్తిని పెంపొందించేందుకు పార్టీ చేసిన పోరాటాన్ని వివరిస్తూ జనసేన సోషల్ మీడియా వింగ్ విడుదల చేసిన ప్రత్యేక డాక్యుమెంటరీలు, హ్యాష్ ట్యాగ్ లు జాతీయస్థాయిలో ట్రెండింగ్ లోకి వచ్చాయి. జనసేన జాతీయ సమైక్యత అజెండాతో ఢిల్లీలో బలప్రదర్శన చేయడం రాజకీయ వర్గాలను ఆకట్టుకుంది.

  • ఢిల్లీలో ప్రత్యేక ఆకర్షణగా..

మరోవైపు జనసేన జాతీయ పార్టీగా అవతరించేందుకు పొలిటికల్గా పక్క ప్లాన్ తో పవన్ అడుగులు వేస్తున్నట్లు అర్థం అవుతుంది. జూలైలో ప్రారంభం కాబోయే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల కంటే ముందే.. జాతీయస్థాయిలో తన ఉనికి చాటుకుంది జనసేన. కేవలం తమ పార్టీ ఏపీకి పరిమితం కాకుండా దక్షిణ భారతదేశమంతా విస్తరించేలా పక్కా రోడ్డు మ్యాప్ సిద్ధం చేశారు. తెలంగాణతో పాటు కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పవన్ కళ్యాణ్ కు ఉన్న ప్రజాదరణ, యువత క్రేజ్ ను ఓటు బ్యాంకుగా మార్చుకునే ప్రక్రియ ప్రారంభం అయినట్టేనని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

Also Read: సిగరెట్ కన్నా అగరబత్తి పొగ ఆరోగ్యానికి హానికరమా…?

Anji Peraboina
Anji Peraboinahttp://www.crimemirror.com
పేరబోయిన ఆంజనేయులు ప్రస్తుతం క్రైమ్ మిర్రర్ తెలుగు దినపత్రికలో సీనియర్ డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పనిచేస్తున్నారు. తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, ప్రభుత్వ పథకాల అప్డేట్లు, మౌలిక సదుపాయాల అభివృద్ధి, రాజకీయ పరిణామాలు మరియు ప్రత్యేక కథనాలను సమగ్రంగా అందిస్తున్నారు. జర్నలిజం రంగంలో 7 సంవత్సరాలకు పైగా అనుభవం కలిగిన ఆయన, గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాష్ట్ర వార్తలు మరియు రాజకీయ విశ్లేషణలు రాశారు. క్షేత్రస్థాయిలో రాజకీయ సర్వేల్లో పాల్గొన్న అనుభవంతో పాటు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ మరియు పరిశోధనాత్మక జర్నలిజంలో ప్రత్యేక నైపుణ్యం సంపాదించారు. తెలంగాణ రాజకీయ పరిణామాలపై లోతైన అవగాహనతో పాటు, ప్రజలకు నమ్మకమైన సమాచారం అందించడంలో అంజి కృషి కొనసాగుతోంది. తన ప్రతిభకు గుర్తింపుగా, 2025 ఆగస్టులో ఉత్తమ పనితీరు కోసం జర్నలిస్టు అవార్డు అందుకున్నారు.

తాజావార్తలు